మనకి వుండే ముఖ్య డాక్యుమెంట్స్ లో ఆధార్ కార్డు ఒకటి. ఆధార్ కార్డు వలన ఎన్నో లాభాలు వున్నాయి. ఏ చిన్న పని చేయాలన్నా కూడా ఆధార్ ఉండాల్సిందే. 12 అంకెల ప్రత్యేకమైన నంబర్ ఉంటుంది. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా దీన్ని జారీ చేస్తుంది. అయితే చాలా మందికి వారి ఆధార్ లో ఫోటో నచ్చదు. దాన్ని మార్చాలని అనుకుంటారు. ఆధార్ కార్డు ఫోటో నచ్చని వారిలో మీరు కూడా ఒకరు అయితే ఇలా చెయ్యండి. ఆధార్ కార్డు ఫోటోను మార్చుకోవచ్చు. ఆధార్ కార్డులోని ఫోటో మార్చేందుకు ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ సెంటర్‌కు వెళ్లాలి.
మీరు https://appointments.uidai.gov.in/.లో మీ సమీపం లో ఉన్న ఆధార్ నమోదు కేంద్రాన్ని తెలుసుకోవచ్చు. యూఐడీఏఐ వెబ్‌సైట్ ద్వారా ఆధార్ నమోదు, సవరణ లేదంటే అప్డేట్ ఫారమ్ డౌన్‌లోడ్ చెయ్యచ్చు. లేదంటే ఆధార్ కేంద్రంలో తీసుకోవచ్చు. ఆ ఫారమ్ లో వివరాలని పూరించి ఆధార్ కేంద్రంలో ఇవ్వాలి. ఆ తర్వాత మీ వివరాలను అప్డేట్ చేస్తారు. ఫోటో మార్చుకోవాలన్నప్పుడు లైవ్ ఫోటో తీసుకుంటారు. మీరు రూ.100 ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఆ తరవాత అప్డేట్ రిక్వెస్ట్ నంబర్ అక్నాలెడ్జ్మెంట్ స్లిప్ వస్తుంది. స్టేటస్ చెక్ చేసేందుకు ఉపయోగపడుతుంది.