కేంద్రం ఎన్నో రకాల స్కీములని అందిస్తోంది. కేంద్ర ప్రభుత్వ స్కీమ్స్ తో సూపర్ బెనిఫిట్స్ ని పొందవచ్చు. ఆడ పిల్లల జననాలను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం వినూత్న పథకాన్ని తీసుకు వచ్చిన విషయం తెలిసిందే. ‘మిషన్ శక్తి’ కింద ‘ప్రధాన మంత్రి మాతృత్వ వందన యోజన పథకాన్ని తీసుకు వచ్చింది. అయితే ఈ స్కీమ్ తో రెండో సారి గర్భం దాల్చినప్పుడు ఆడపిల్ల పుడితే అప్పుడు రూ.6000 ని ఆర్థిక సాయంగా పొందొచ్చు.
2022 ఏప్రిల్ నుండే ఈ స్కీమ్ ని తీసుకు వచ్చింది. ప్రస్తుతం ఈ స్కీము ప్రకారం అయితే ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన కింద మొదటి కాన్పు లో ఆడ పిల్ల లేదా మగ బిడ్డ పుడితే ఆన్‌లైన్‌లో నమోదుకాగానే రూ.1000, ఆరు నెలల తర్వాత రూ.2000, ప్రసవం జరిగిన 14 వారాల్లో రూ.2000 చొప్పున మూడు సార్లు ఈ డబ్బులు పడతాయి.
కానీ ఇప్పుడు అయితే గర్భం దాల్చినప్పుడు రూ.3,000, ప్రసవం జరిగిన 14 వారాలకు రూ.2,000 చొప్పున రెండు విడతల్లోనే వీటినిస్తారు. రెండో కాన్పుకు మాత్రం ఈ పథకం వర్తించదు. ఈ స్కీమ్ లో మార్పులు చేసారు ఇప్పుడు. రెండో కాన్పులో అమ్మాయి పుడితే రూ.6000 ఇక మీదట ఇస్తారు. అంతే కాదు రెండో కాన్పులో కవలలు జన్మించి, వారిలో ఒకరు అమ్మాయి ఉన్నా కూడా ఈ పథకం వర్తిస్తుంది. జనన ధ్రువీకరణ పత్రం ఆధారంగా వీటిని ఇస్తారు. ఆడపిల్లల జననాలను ప్రోత్సహించేందుకే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.