మంచిర్యాలలో సిఎం కెసిఆర్ సభకు లక్ష కు పైగా జనం రావడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు ఎమ్మెల్యే బాల్క సుమన్. సింగరేణి కార్మికుల సంక్షేమం కోసం ఎంతో చేశామన్నారు. ఈ ప్రాంతం లో కనివిని ఎరగని తరహాలో సభ జరగబోతుందన్నారు. మూడు పథకాలను సీఎం ఇక్కడి నుంచే ప్రారంభిస్తున్నారని తెలిపారు. గత ప్రభుత్వాలు మాటల గారడీ చేసారని.. ఇప్పుడు పని చేసి చూపిస్తున్నామన్నారు.
సింగరేణిని కాంగ్రెస్ ప్రభుత్వం సగం ముంచితే.. బిజేపి నిండా ముంచుతుందన్నారు. తాము చేసే అభివృద్ధి చూసి ప్రతిపక్షాలు ఓర్వలేక ఆరోపణలు చేస్తున్నాయని మండిపడ్డారు బాల్క సుమన్. బురద, వరదలోను ప్రతిపక్షాలు రాజకీయాలు చేస్తున్నాయన్నారు. ఇందిరమ్మ ఇండ్లు కట్టింది తక్కువ.. బిల్లులు లేపింది ఎక్కువని ఎద్దేవా చేశారు. ఇసుక మేటల కోసం వరదలు రావాలని కోరుకునే వారు ఉన్నారని అన్నారు. గోదావరి, ప్రాణహిత వరద రావాలని కొంత మంది రైతులు కోరుకుంటున్నారని తెలిపారు.