ఎన్నికల ప్రక్రియకు సంబంధించి నిబంధనల్లో మార్పులు చేయడాన్ని వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్.. వీటిపై సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఈ చర్యల వల్ల ఎన్నికల ప్రక్రియ సమగ్రతకు భంగం కలుగవచ్చని కాంగ్రెస్ పేర్కొంది. ఎన్నికల కమిషన్ ఇటీవలే చేసిన సవరణలను సవాల్ చేస్తూ రిట్ పిటిషన్ దాఖలు చేసింది. ఎన్నికలకు సంబంధించిన ఎలక్ట్రానిక్ రికార్డులను ఎవరైనా తనిఖీ చేసేందుకు అనుమతించే నిబంధనల్లో ఎన్నికల సంఘం ఇటీవల మార్పులు చేసింది.
పోలింగ్ కు సంబంధించిన సీసీ టీవీ పుటేజ్ ను, వెబ్ కాస్టింగ్ రికార్డులను, అభ్యర్థులకు చెందిన వీడియో రికార్డులను తనిఖీ చేయకుండా నిషేదం విధించింది. ఎన్నికల సంఘం సిపారసు మేరకు.. ఎన్నికల నిర్వహణ నిబంధనలుఒ1961లోని రూల్ 93(2) (ఏ) ను కేంద్ర న్యాయశాఖ సవరించింది. ఈ చర్యలను కాంగ్రెస్ తీవ్రంగా ఖండించింది. ఈ అంశం పై ఏఐసీసీ జనరల్ సెక్రటరీ జైరాం రమేష్ సుప్రీంకోర్టులో తాజాగా రిట్ పిటిషన్ దాఖలు చేసారు.