ప్రభుత్వ కార్యాలయాల టైమింగ్స్‌ లో మార్పులు

-

అమరావతి : కోవిడ్ కారణంగా మార్పులు చేసిన ప్రభుత్వ కార్యాలయాల పనివేళల్ని పునరుద్ధరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ సర్కార్‌. ఇక నుంచి జిల్లా కార్యాలయాలు ఇతర ఉప కార్యాలయాలు ఉదయం 10.30 గంటల నుంచి ఐదు గంటల వరకూ పనిచేస్తాయని స్ఫష్టం చేసింది ఏపీ ప్రభుత్వం.

సచివాలయంతో పాటు విభాగాధిపతులు, కార్పొరేషన్లు ఇతర ప్రభుత్వ సంస్థల కార్యాలయాలు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకూ పనిచేస్తాయని స్పష్టం చేసింది ప్రభుత్వం. జిల్లా కార్యాలయాలకు ఆదివారం, రెండో శనివారం మాత్రమే సెలవు ఉంటుందని స్పష్టం చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

సచివాలయం, విభాగాధిపతులు, కార్పోరేషన్లకు సంబంధించి రాష్ట్ర కార్యాలయాలు మరో ఏడాది పాటు వారానికి ఐదు రోజులే పనిచేస్తాయని వెల్లడించింది. కోవిడ్ ప్రభావం స్వల్పంగా తగ్గటంతో ప్రభుత్వ కార్యాలయాల పనివేళల్ని పునరుద్ధరిస్తూ ఉత్తర్వులు జారీ చేసారు సీఎస్ ఆదిత్యనాధ్ దాస్. ఇది ఇలా ఉండగా.. ఏపీలో రోజు రోజుకు కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news