గూగుల్‌కే చెమటలు పట్టిస్తున్న చాట్‌ జీపీటీ..! ఐదు రోజుల్లోనే వన్‌ మిలియన్‌ యూజర్లు..!!

-

ఈ మధ్య టెక్‌ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు.. చాట్‌ జీపీటీ.. ముఖ్యంగా కోడింగ్‌ నేర్చుకునేవాళ్లకు ఇది ఇప్పటికే తెలిసి ఉంటుంది.. ఛాట్ బోట్స్ మనకందరికీ తెలుసు.. చాలా చోట్ల అప్లికేషన్స్ అన్నీ చాట్ బోట్స్ తోనే రన్ అవుతున్నాయి. అలాంటి దశను దాటుకుని ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో వస్తున్న ఓ చాట్ బోటే చాట్ జీపీటీ. చాట్ అంటే మాట్లాడటం. జీపీటీ అంటే జనరేటివ్ ప్రీ ట్రైన్డ్ ట్రాన్సఫార్మర్..ఇప్పుడు ఇది గూగుల్‌ లాంటి దిగ్గజ సంస్థలకే చెమటలు పట్టిస్తుంది..గూగుల్‌కు పోటీగా ఈ టెక్నాలజీ రావడంతో దిగ్గజ సంస్థలు తలలు పట్టుకుంటున్నాయి.. అసలేంటీ చాట్‌ జీపీటీ, ఏం చేస్తుందో జర చూద్దామా..!

ఈ చాట్ బోట్ ను ముందు ట్రైన్డ్ చేస్తారు. ఎప్పటికప్పుడు విషయాలను దీనికి ఇంక్లుడ్ చేయటం ద్వారా ఈ చాట్ జీపీటీ మనకు సమాధానాలు ఇస్తూ ఉంటుంది. ఇంతకీ చాట్ జీపీటీ వల్ల ఎందుకు దిగ్గజ సంస్థలు ముప్పు ఎందుకంటే… మనం నెట్ ఓపెన్ చేసి సెర్చ్ ఇంజిన్‌లో ఏదైనా సెర్చ్ చేస్తే చాలు వందలకొద్దీ ఇన్ఫర్మేషన్ వచ్చి పడిపోతుంటుంది. గూగుల్‌ సర్చ్‌ ఇంజిన్‌ అంతా..ఎస్‌ఈవో మీదే ఆధారపడి ఉంటుంది. మనం సర్చ్‌ చేసిన దానికి రిలేటెడ్‌ కీవోర్డ్స్‌తో ఉన్న సమాచారం అంతా చూపిస్తుంది.. అందులో మనం వెతికింది ఒకటే అయితే కొన్నిసార్లు వచ్చేది మరొకటి.. ఏది మిస్ లీడ్ చేసే విషయమో తెలుసుకోవటం కష్టం. ఒక్క పదంతో సెర్చ్ చేస్తే వంద ఆప్షన్లు వస్తాయి. ఏది సెలెక్ట్ చేసుకోవాలనేది మళ్లీ మనకే పెద్ద టాస్క్. కానీ.. చాట్ జీపీటీ అలా కాదు…ఒకటే ఆన్సర్ ఇస్తుంది. మహేష్‌ బాబు అంటే ఎవరు అని మీరు చాట్ జీపీటీ సర్చ్‌ చేశారో అనుకో.. సింపుల్ గా ఓ ముప్పై పదాల్లో చెప్పేస్తుంది. ఏదైనా ప్రాబ్లం దానికి చెప్పామనుకోండి అది మొత్తం సాల్వ్ చేసి ఇస్తుంది. కోడింగ్‌ క్వషన్‌ వేస్తే అదే కోడ్‌ రాసేస్తుంది..

Open AI అనే ఆర్టిఫీషియల్ ఇంటిలెజెన్స్ మీద వర్క్ చేస్తున్న కంపెనీ ఈ చాట్ జీపీటీని లాంచ్ చేసింది. నవంబర్ లో అనౌన్స్ చేసి మొన్న డిసెంబర్ 15న లాంచ్ చేశారు . కేవలం ఐదు రోజుల్లోనే వన్ మిలియన్ యూజర్లను ఈ సర్వీస్ దక్కించుకుంది. ఈ నెంబర్ అచీవ్ అవ్వటానికి చాలా పెద్ద కంపెనీలకు కూడా ఎంతో టైమ్ పట్టింది. అందుకే గూగుల్ లాంటివి చాట్ జీపీటీ మీద రెడ్ కోడ్ పెట్టాయి. అవి చేస్తున్న పనులు..తెస్తున్న మార్పులను నిశితంగా పరిశీలిస్తున్నాయి…

చాట్‌ జీపీటీ వాడటం ఎలా..?

చాట్ జీపీటీ మన సిస్టమ్ లోనో ల్యాప్ ట్యాప్ లోనో వాడటం ఎలా అంటే… ఓపెన్ ఏఐ వెబ్ సైట్‌లోకి వెళ్లి లాగిన్ అవ్వొచ్చు..లేదంటే గూగుల్ సెర్చ్‌లో చాట్ జీపీటీ అని కొట్టి..ఓపెన్ ఏఐ వెబ్ సైట్ నుంచి ఇన్ స్టాల్ చేసుకోవచ్చు. మన మెయిల్ ఐడీ, మొబైల్ నెంబర్ ఇస్తే…ఓ ఐడీని మొబైల్ నెంబర్‌కి పంపిస్తుంది. అది ఎంటర్ చేస్తే యాక్టివేషన్ లింక్‌ మెయిల్‌కు వస్తుంది.. అది క్లిక్ చేస్తే ఈ చాట్ జీపీటీ లాంచ్ అవుతుంది.

కొన్ని సమస్యలు కూడా..

అయితే దీంతో ప్రస్తుతానికి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దీనిని 2021 వరకే అప్ డేట్ చేశారు. సో ఇది చెప్పే విషయాలన్నీ 2021 వరకే ఉంటాయి… ఆ తర్వాత తనకు తెలియదని చెబుతుంది. ఎందుకంటే దీన్ని ప్రస్తుతానికి ఇంటర్నెట్‌కు లింక్ చేయలేదు. త్వరలో చేయనున్నట్లు రూపకర్తలు వెల్లడించారు. గూగుల్ కూడా చాట్ జీపీటీలాంటి దాన్ని క్రియేట్ చేసి తన సెర్చ్ ఇంజిన్‌లో పెట్టాలని భావిస్తోంది. ఎందుకంటే యూజర్ ఫ్రెండ్లీగా..యూజర్ పర్ స్పెక్టివ్ నుంచి ఆలోచిస్తుంటే అడిగిన దానికి మాత్రమే కచ్చితమైన సమాచారం ఇచ్చే ఇలాంటి వ్యవస్థ రాబోయే రోజుల్లో ఇంటర్నెట్ ఫేజ్‌ను మరో కొత్త లెవల్ కు తీసుకెళ్లొచ్చు.గూగుల్ సహా అనేక టెక్ సంస్థలు ఈ చాట్ జీపీటీ తెస్తున్న విప్లవాన్ని నిశితంగా గమనిస్తున్నాయి. ఇది వర్క్‌ సాఫ్ట్‌వేర్‌ ఫీల్డ్‌లో సగం పనిభారం తగ్గిపోతుంది..ఇదే నీట్‌గా కోడ్‌ రాసి ఇస్తుంటే..ఇంక మనుషులతో ఏం పని.. అయితే ఏ కంపెనీ కూడా గుడ్డిగా కంప్యూటర్లను నమ్మదు.. సో..ఇది చేసిన వర్క్‌ను చెక్‌ చేయడానికి ఎక్స్‌పర్ట్స్‌ అవసరం అవుతారు..!

Read more RELATED
Recommended to you

Latest news