ఫాస్ట్‌ట్యాగ్ బ్యాలెన్స్ ఎంత ఉందో తెలీదా..? ఇలా ఈజీగా తెలుసుకోవచ్చు..!

-

జాతీయ రహదారులపై వెళ్లే వాహనదారులకు కచ్చితంగా ఫాస్ట్‌ట్యాగ్ ఉండాలి. టోల్ ప్లాజాల మీదుగా వెళ్లేవాహనాలకు పక్కా ఫాస్ట్‌ట్యాగ్ ఉండాలి. ఇంచుమించుగా వాహనదారుల అందరికీ కూడా ఫాస్ట్‌ట్యాగ్ ఉంది. ఫాస్ట్‌ట్యాగ్ కనుక లేకపోతే టోల్ ప్లాజాల దగ్గరే వీటిని ఇచ్చేస్తున్నారు. టోల్ ఛార్జీలను ఎలక్ట్రానిక్ పద్ధతిలో చెల్లించేందుకు ఫాస్ట్‌ట్యాగ్స్ ఉపయోగ పడతాయి.

ఈ ఫాస్ట్‌ట్యాగ్ కనుక పని చేయాలంటే అందులో బ్యాలెన్స్ తప్పక ఉండాలి. ఇక మరి ఇప్పుడు ఫాస్ట్‌ ట్యాగ్ అకౌంట్ బ్యాలెన్స్ ఎలా చెక్ చేయాలి…? ఈ విషయాన్ని ఇప్పుడు చూసేద్దాం. సింపుల్‌గా ఫాస్ట్‌ట్యాగ్ అకౌంట్ బ్యాలెన్స్ ని చూడచ్చు. వెబ్‌సైట్‌లో లాగిన్ అయ్యి మీరు బ్యాలెన్స్ ని చూడచ్చు.

దీని కోసం మొదట మీరు వెబ్‌సైట్‌ లో లాగిన్ అవ్వాలి.
ఆ తరవాత మీరు ఫాస్ట్‌ట్యాగ్ అకౌంట్ సెక్షన్‌ లోకి వెళ్లాలి.
మీ డీటెయిల్స్ ఇచ్చేసి డీటెయిల్స్ తో లాగిన్ అవ్వాలి.
ఇప్పుడు వ్యూ బాలన్స్ పైన క్లిక్ చెయ్యండి.
ఫాస్ట్‌ట్యాగ్ అకౌంట్ బ్యాలెన్స్ ఇలా తెలుస్తుంది.
ఎస్ఎంఎస్ ద్వారా ఫాస్ట్‌ ట్యాగ్ అకౌంట్ బ్యాలెన్స్ చెక్ చెయ్యచ్చు.
ఎస్ఎంఎస్ ద్వారా కూడా మీరు బ్యాలెన్స్ ని చూడచ్చు.
ఫాస్ట్‌ట్యాగ్‌కు రిజిస్టర్ చేసిన తర్వాత టోల్ ప్లాజాల దగ్గర నుండి డెబిట్ అయ్యాక మెసేజ్ వస్తుంది.
ఇలా ఫాస్ట్‌ట్యాగ్ అకౌంట్ బ్యాలెన్స్ ఎంతో తెలిసిపోతుంది.
ప్రీపెయిడ్ వ్యాలెట్‌కు మీ మొబైల్ నెంబర్ రిజిస్టర్ అయి ఉంటే ప్రీపెయిడ్ ఫాస్ట్‌ట్యాగ్ కస్టమర్ అయితే 08884333331 టోల్ ఫ్రీ కి కాల్ చెయ్యండి.
My FASTag యాప్ డౌన్‌లోడ్ చేసి కూడా మీరు బ్యాలెన్స్ ని చెక్ చెయ్యచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news