కావాల్సిన పదార్ధాలు:
కోడిగుడ్లు: రెండు
క్యాప్సికమ్ ముక్కలు: పావు కప్పు
ఉల్లిముక్కలు: పావు కప్పు
ఉప్పు: కొద్దిగా
కారం: పావుటీస్పూను
పసుపు: చిటికెడు
కొత్తిమీర: కొద్దిగా
పుదీనా: కొద్దిగా
నూనె: 2 టీ స్పూన్లు
చీజ్: సుమారు పావు కప్పు
గరంమసాలా: పావు టీ స్పూను
తయారీ విధానం:
ముందుగా ఓ చిన్న గిన్నెలో గుడ్లసొన వేసి బాగా గిలకొట్టాలి. నాన్‌స్టిక్ పాన్‌లో నూనె వేసి ఉల్లిముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, ఉప్పు వేసి వేయించాలి. తరవాత గరంమసాలా, పసుపు, కారం, కొత్తిమీర తురుము, పుదీనా, అన్నీ వేసి కలిపి వేయించి తీసి గిలకొట్టిన గుడ్డుసొనలో వేసి కలపాలి.
ఇప్పుడు మరో టీస్పూను నూనె పాన్‌లో వేసి మిశ్రమాన్ని ఆమ్లెట్‌లా వేసి రెండువైపులా కాలాక ఒకవైపున చీజ్ తురుము చల్లి అది కరిగేవరకూ సిమ్‌లో ఉంచి స్టౌ ఆఫ్ చేయాలి. అంతే నోరూరించే యమ్మీ యమ్మీ చీజ్ ఆమ్లెట్ రెడీ.