బీబీసీ కెమెరామెన్ పై కొమ్ములతో విరుచుకుపడిన గొర్రె.. వైరల్ వీడియో

-

నిజానికి ఆ గొర్రె ఆఫ్రికాకు చెందినది. అవి ప్రపంచంలోనే చాలా అరుదైన జాతికి చెందిన గొర్రెలు. అందుకే.. ఆ గొర్రె గురించి పార్క్ కు చెందిన సిబ్బంది బీబీసీకి వివరిస్తుండగానే గొర్రె కెమెరామెన్ పై అటాక్ చేసింది.

సాధారణంగా జంతువులను ఎంత మచ్చిక చేసుకుంటే అవి అంతలా మనుషులతో కలిసిపోతాయి. కానీ.. వాటికి ఎవరైనా కొత్తవాళ్లు కనిపిస్తే మాత్రం తమ ప్రతాపాన్ని చూపిస్తాయి. వాళ్లతో ఫైట్ చేస్తాయి. చిన్న చిన్న జంతువులైతే పెద్దగా పట్టించుకోం. కానీ… ఒకవేళ పెద్ద జంతువులు దాడి చేస్తే ఇంకేమన్నా ఉందా? ప్రాణాలకే ప్రమాదం ఏర్పడుతుంది.

అయితే.. ఇప్పుడు మీరు చూడబోయే వీడియో అంత పెద్ద ప్రమాదమైందేమీ కాకున్నా.. చాలా ఫన్నీ వీడియో. మీరు మాత్రం నవ్వకుండా ఉండలేరు. ఈ ఘటన ఇంగ్లండ్ లోని విల్ట్ షైర్ లో చోటు చేసుకున్నది. బీబీసీకి చెందిన ఓ కెమెరామెన్ ఆనిమల్ పార్క్ లో కెమెరాతో షూట్ చేస్తున్నాడు. ఇంతలో అక్కడికి ఒక గొర్రె వచ్చింది. దానితో బీబీసీ సిబ్బంది కాసేపు గడిపారు. తర్వాత ఆ గొర్రె… తిన్నగా కెమెరాలో షూట్ చేస్తున్న కెమెరామెన్ దగ్గరికి వచ్చి మనోడి ముఖ్యమైన పార్ట్స్ వద్ద అటాక్ చేసింది. ఈ చర్యతో అక్కడున్నవాళ్లంతా బిత్తరపోయారు. కెమెరామెన్ మాత్రం తన కెమెరాను పక్కన పడేసి కిందపడిపోయాడు.

నిజానికి ఆ గొర్రె ఆఫ్రికాకు చెందినది. అవి ప్రపంచంలోనే చాలా అరుదైన జాతికి చెందిన గొర్రెలు. అందుకే.. ఆ గొర్రె గురించి పార్క్ కు చెందిన సిబ్బంది బీబీసీకి వివరిస్తుండగానే గొర్రె కెమెరామెన్ పై అటాక్ చేసింది.

ఇక.. ఈ ఘటనకు చెందిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నెటిజన్లు అయితే… ఈ వీడియో చూసి నవ్వకుండా ఉండలేకపోతున్నారు. మీరు కూడా నవ్వుకోండి కాసేపు..

Read more RELATED
Recommended to you

Latest news