రాష్ట్రంలో మరోసారి చిరుత సంచారం కలకలం రేపింది. శ్రీ శైలం-హైదరాబాద్ రహదారిపై అర్ధరాత్రి చిరుత పులి సంచరిస్తుండగా కారులో వెళ్లే ప్రయాణికులు గుర్తించారు. నాగర్ కర్నూలు జిల్లా వటవర్లపల్లి వద్ద చిరుత రోడ్డు దాటుతుండగా కనిపించినట్లు సమాచారం.రోడ్డు దాటుతూ చిరుతు కనిపించగా వాహనదారులు ఒక్కసారిగా భయాందోళనకు గురైనట్లు తెలిసింది.చిరుతను అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలో గుర్తించినట్లు వీడియో ఆధారంగా ఫారెస్టు అధికారులు నిర్ధారించారు.
రాత్రి టైంలో ఇక్కడ జంతువులు రోడ్డు దాటుతుంటాయని పేర్కొన్నారు.అడవిని ఆనుకుని ఉన్న రహదారులపై వెళ్లేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని ప్రయాణికులకు సూచించారు. పండుగల టైంలో శ్రీశైలం ప్రాజెక్టు గేట్ల గుండా వెళ్లే ప్రయాణికులు కృష్ణమ్మ పరవళ్లను వీక్షించేందుకు ఈ మార్గంలో కాసేపు ఆగుతుంటారు. దీంతో ట్రాఫిక్ రద్ధీ పెరిగింది.వాహనదారులు ఫారెస్టు పరిధి గుండగా వెళ్ళే క్రమంలో అప్రమత్తంగా వ్యవహరించాలని, రోడ్ల మీద సంచరించరాదని ఫారెస్టు అధికారులు హెచ్చరించారు