ప్రపంచాన్ని శాసించే స్థాయికి భారత్ : కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

-

కేంద్రంలోని మోడీ ప్రభుత్వ హయాంలో భారత్ ప్రపంచాన్ని శాసించే స్థాయికి చేరిందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు.మంగళవారం నగరంలోని బషీర్‌బాగ్ భారతీయ విద్యా భవన్ పాఠశాలలో నిర్వహించిన రోజ్‌గార్ మేళాలో ఆయన పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో ఎంపికైన 155 మందికి కేంద్రమంత్రి నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశాభివృద్ధిలో యువత భాగస్వామ్యం అవసరమని అభిప్రాయపడ్డారు.

నేడు ప్రపంచాన్ని శాసించే స్థాయికి భారత్ ఎదిగిందని చెప్పారు.ప్రధాని మోడీ సారథ్యంలో వికసిత్ భారత్ దిశగా దేశాన్ని ముందుకు తీసుకువెళ్తున్నామన్నారు. రాబోయే 25 ఏళ్లు దేశానికి అమృత కాలమని ప్రధాని మోడీ అన్నారని గుర్తు చేశారు.దాదాపు 75 దేశాలకు డిఫెన్స్ పరికరాలను ఎగుమతి చేస్తున్నామన్నారు. ఉగ్రవాదంపై కేంద్రం ఉక్కపాదం మోపిందని పేర్కొన్నారు. వ్యవసాయ విధానాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామన్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news