మరమరాలతో పాన్‌ కేక్.. ఇలా చేసి పిల్లలకు పెడితే.. ఆహా..!

-

పాన్‌ కేక్‌ అంటే.. చిన్నపిల్లలకు భలే ఇష్టం కదా..! అయితే వీటిలో పంచదార, మైదా ఎక్కువగా వాడతారు కాబట్టి.. అవి పిల్లల ఆరోగ్యానికి అంత మంచిది కాదు. మనం ఈరోజు మరమరాలతో పాన్‌ కేక్‌ ఎలా చేయాలో చూద్దామా.! ఇది తినడం వల్ల ఏం కాదు.. నిజానికి మరమరాలతో ఏం చేసినా చాలా టేస్టీగా ఉంటాయి. ఇంకెందుకు ఆలస్యం ఎలా చేయాలో చూద్దామా..!

మరమరాలతో పాన్‌ కేక్‌ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు..

  • మరమరాలు రెండు కప్పులు
  • పుట్నాల పప్పు పొడి అర కప్పు
  • పెరుగు అరకప్పు
  • క్యారెట్‌ తురుము అరకప్పు
  • టమోటా ముక్కలు అరకప్పు
  • కొత్తిమీర ఒక కప్పు
  • పాలకూర తురుము అరకప్పు
  • క్యాప్సికమ్‌ ముక్కలు అరకప్పు
  • అల్లం తురుము ఒక టేబుల్‌ స్పూన్
  • నువ్వులు ఒక టేబుల్‌ స్పూన్
  • ఎండుమిరపకాయలు ముక్కా చెక్కా ఒక టీ స్పూన్
  • జీలకర్ర పొడి ఒక టీ స్పూన్
  • ఆవాలా ఒక టీ స్పూన్
  • మీగడ ఒక టీ స్పూన్
  • కరివేపాకు కొద్దిగా

తయారుచేసే విధానం..

మిక్సీజార్‌ తీసుకుని అందులో దోరగా వేయించుకున్న మరమరాలు , పుట్నాల పొడి వేసి మెత్తగా పొడి చేసుకోండి. ఒక బౌల్‌ తీసుకుని అందులో క్యారెట్‌ తురుము, అల్లం తురుము, పాలకూర తురుము, కొత్తిమీర తురుము, టమోటా ముక్కలు, ఎండుమిరకాయలు ముక్కా చెక్కా, జీలకర్ర పొడి, పుల్లటి పెరుగు వేసి కలుపుకోండి. ఇవి బాగా కలిపిన తర్వాత ముందుగా పొడి చేసుకున్న మరమరాల పొడి వేసి కలుపుకోండి. నాన్‌ స్టిక్‌ పాత్ర తీసుకుని అందులో కావాల్సిన మందంలో ఈ మిశ్రమాన్ని వేసుకుని పైన నువ్వులు, ఆవాలు, కరివేపాకు వేసి కాలనివ్వండి. 7-8 నిమిషాల అలా కాలనిచ్చి వేరే వైపుకు మెల్లగా తిప్పుకుని మరోవైపు కూడా కాలనివ్వండి. మెత్తగా దూదిలా ఉంటుంది. ఈ స్టైల్‌లో చేసుకుంటే..హెల్తిగా ఉంటుంది. టేస్టీగా కూడా ఉంటుంది. ఈవినింగ్‌ టైమ్స్‌లో స్నాక్స్‌లా చేసుకుని తినేయొచ్చు.!

Read more RELATED
Recommended to you

Latest news