ధోనీ రిటైర్మెంట్‌పై చెన్నై సూపర్ కింగ్స్ సీఈవో బిగ్ అప్ డేట్

-

చెన్నై సూపర్‌కింగ్స్‌ మాజీ కెప్టెన్‌, స్టార్‌ బ్యాట్స్‌మెన్‌ ఎంఎస్‌ ధోనికి ఐపీఎల్‌ 2024 సీజనే చివరిదని వార్తలు వినిపిస్తున్నాయి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో ధోని తన చివరి మ్యాచ్‌ను రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతోనేనని అనేక నివేదికలు పేర్కొన్నాయి.అయితే.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ తర్వాత, ధోని రిటైర్మెంట్ గురించి ఎలాంటి ప్రకటన చేయలేదు. కాగా.. ఈ సీజన్లో చివరి మ్యాచ్ అయిపోగానే మరుసటి రోజు ధోనీ రాంచీకి వెళ్లాడు.

ఇదిలా ఉంటే.. ధోనీ రిటైర్మెంట్‌పై చెన్నై సూపర్ కింగ్స్ సీఈవో కాశీ విశ్వనాథన్ బిగ్ అప్ డేట్ ఇచ్చారు.

కాశీ విశ్వనాథన్ మాట్లాడుతూ.. ‘ధోని మాకు ఏమీ చెప్పలేదు. ఈ సీజన్‌లో అతను బ్యాటింగ్ చేసిన విధానం, అతను ఖచ్చితంగా ఆటను కొనసాగించగలడు అని నమ్మకం మాకు ఉంది. అయితే అదంతా అతనిపై ఆధారపడి ఉంటుంది. ధోనీ మాకు అలాంటి విషయాలు చెప్పడు, ధోనీనే నిర్ణయం తీసుకుంటాడు.’ అని ఆయన వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news