పాలిగ్రాఫ్ పరీక్షకు సిద్ధమైన స్వాతి మాలివల్

-

తన ఆరోపణలను ఆమ్ ఆద్మీ పార్టీ కొట్టిపారేస్తున్న నేపథ్యంలో ఆప్ రాజ్యసభ ఎంపీ స్వాతి మాలివాల్ మరో సాహసానికి పూనుకున్నారు. ఆమె పాలిగ్రాఫ్ పరీక్షకు సిద్ధమయ్యారు.ఈ మేరకు ఆమె పోలీసులను అభ్యర్థించారు. తనకు పాలిగ్రాఫ్ టెస్ట్ చేయాలని పోలీసులను కోరారు.

ఇదిలా ఉంటే మే 13న సీఎం అరవింద్ కేజ్రివాల్ నివాసంలో స్వాతి మాలివాల్‌పై కేజ్రీవాల్ పీఏ బిభవ్ కుమార్‌ భౌతికదాడికి పాల్పడిన వీడియోలు ఇప్పటివరకు ఒక్కడి కూడా బయటికి రాలేదు.కానీ సెలెక్టివ్‌ వీడియోలను మాత్రం ఆప్ విడుదల చేసింది. ఆ వీడియోలో స్వాతి మాలివాల్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విజువల్స్ మాత్రమే విడుదల చేశారు. కానీ డ్రాయింగ్ రూమ్‌లో ఏం జరిగిందో అన్న విషయం మాత్రం బయటకు రాలేదు. దీంతో తనపై ఆప్ నిందలు మోపడం బాధ కలిగిస్తోందని స్వాతి మాలివాల్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.దాడి జరిగిన తర్వాత కేజ్రీవాల్ ఇంటి నుంచి బయటకు వెళ్లినప్పుడు తన బట్టలు చిరిగిపోలేదని ఆప్ మంత్రి చెబుతున్నారని.. ఎప్పుడూ కూడా బాధితురాలిపైనే నిందలు మోపుతారని.. నిర్భయ విషయంలో కూడా ఇదే జరిగిందని స్వాతి మాలివాల్ వాపోయారు. అందుకోసమే తనకు పాలిగ్రాఫ్ పరీక్ష నిర్వహించాలని పోలీసులను కోరుతున్నట్లు స్వాతి మాలివాల్ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news