ఏపీలో భారీగా తగ్గిన చికెన్‌ ధరలు..కిలో రూ. 90 మాత్రమే

-

నాన్ వెజ్ ప్రియులకు గుడ్ న్యూస్. గత కొంత కాలంగా కొండెక్కి కూర్చున్న చికెన్ రేట్లు భారీగా తగ్గుతున్నాయి. సండే వచ్చిందంటే చాలు.. చాలా మంది ఇళ్లల్లో మసాలా గుమగుమలాడాల్సిందే.

ముఖ్యంగా సండే రోజు అందరికి అందు బాటులో ఉండే చికెన్ కూర లేని ఇళ్లు ఉండదంటే అతిశయోక్తి కాదు. అయితే, తాజాగా ఏపీలో భారీగా చికెన్‌ ధరలు తగ్గాయి. ఏపీలో ఇవాళ కిలో చికెన్‌ ధర రూ. 90 మాత్రమే నడుస్తోంది. అటు కోడి గుడ్ల ధర కూడా భారీగా పడిపోయింది. ఒక డజన్‌ కోడి గుండ్ల ధర రూ.66 మాత్రమే పలుకుతోంది. విజయవాడలో కిలో చికెన్‌ ధర రూ. రూ. 90 మాత్రమే నడుస్తోంది. అటు గుంటూరు ఎక్కువగా రూ. 98 మాత్రమే నడుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news