నో ఫ్లూ ఫియర్ .. గత వారం కంటే పెరిగిన చికెన్ కొనుగోళ్లు !

దాదాపు ఆరు, ఏడు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ కలకలం రేపుతోంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆ టెన్షన్ వాతావరణం నెలకొంది. అయితే బర్డ్‌ ఫ్లూ విషయంలో అధికారులు అప్రమత్తంగా ఉన్నామని ఇరు రాష్ట్రాల మంత్రులు గట్టిగానే చెబుతున్నారు. అయితే జనాలు మంత్రుల మాటలు సీరియస్ గానే తీసుకుంటున్నారు. అందుకే హైదరాబాద్ లో చికెన్ ధరలు, కొనుగోళ్లు ఏమాత్రం తగ్గలేదు.

గత వారం అంటే మొన్నటి సండే కొనుగోళ్లు లేక బోసిపోయిన చికెన్ సెంటర్లు.. ఇవాళ రద్దీగా మారాయి. కేజీ చికెన్ పది రోజులుగా 180 రూపాయలు గానే ఉంది. ధర ఏమాత్రం తగ్గలేదు. సేల్స్ కూడా సాధారణ స్థితిలోనే ఉన్నాయని చికెన్ సెంటర్ యజమానులు చెబుతున్నారు. అయితే మిగతా ప్రాంతాల్లో కూడా అదే పరిస్థితి నెలకొంది అని అంటున్నారు. సో ఇక జనం ఆ టెన్షను లేనట్టే.