మన దేశంలో పెట్రో ధరలు మండిపోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మన దేశంలో పెట్రోల్ రేట్లు… సెంచరీ దాటేశాయి. అటు డిజీల్ ధరలు కూడా పెట్రోల్ ను దాటేసేలా కనిపిస్తున్నాయి. అయితే.. తాజాగా దేశంలో పెరుగుతున్న పెట్రోల్ మరియు డిజీల్ ధరల పై మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి పి. చిదంబరం కీలక వ్యాఖ్యలు చేశారు.
కేంద్ర ప్రభుత్వం సెస్ ను తగ్గిస్తే.. పెట్రోల్ రేట్లు బాగా తగ్గుతాయని పి. చిదంబరం అన్నారు. పెట్రోల్ పై సెస్ రూపం లో ఆయా సందర్భాల్లో కేంద్రం సొమ్మును వసూలు చేస్తోందని.. సెస్ అనేది పన్ను కాదని గుర్తించాలని పేర్కొన్నారు. కేంద్ర ఇలా ఆయా సమయాల్లో వేసిన సెస్ ను తొలగిస్తే.. పెట్రోల్ లీటర్ రూ. 32 కే ప్రజలకు అందుబాటులోకి వస్తుందని అభిప్రాయపడ్డారు. బుధవారం పటాన్ చెరు మండలం రుద్రారంలోని గీతం యూనివర్సిటీలో జరిగిన సెమినార్ కు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా పెట్రోల్ ధరలపై స్పందించారు పి. చిదంబరం.