తాను ‘ఉల్లి’ తిననన్న నిర్మలా సీతారామన్ కు కౌంట‌ర్ ఇచ్చిన చిదంబ‌రం

-

ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో బెయిల్‌పై విడుదలైన కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, రాజ్యసభ సభ్యుడు చిదంబరం పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలకు హాజరయ్యారు. పార్టీ నేతలతో కలిసి ఆందోళనలో పాల్గొన్నారు. పెరుగుతున్న ఉల్లిధరలపై కాంగ్రెస్‌ ఈ నిరసన చేపట్టింది. అయితే తమ ఇంట్లో ఉల్లిపాయలను అంతగా వాడబోమని, తాను ఉల్లిపాయలు పెద్దగా వాడని కుటుంబం నుంచి వచ్చానని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలకు చిదంబరం స్పందించారు.

‘తాను ఉల్లిపాయలు తినబోనని నిన్న ఆర్థిక శాఖ మంత్రి చెప్పారు. మరి ఆమె ఏం తింటారు? అవకాడో పండు తింటారా?’ అని చిదంబరం ఎద్దేవా చేశారు. కాగా, ఉల్లిధరలు పెరిగిపోవడంతో సామాన్యులు పడుతోన్న ఇబ్బందులు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కు తెలియడం లేదని ఈ రోజు కూడా విపక్ష సభ్యులు విమర్శలు గుప్పించారు. ఉల్లి ధరల పెరుగుదలపై పార్లమెంటు ఆవరణలో కాంగ్రెస్ ఎంపీలు నిరసన వ్యక్తం చేశారు. ఇందులో చిదంబరం కూడా పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news