మిషన్ భగీరథపై సీఎం రేవంత్ రెడ్డి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. వేసవి కాలం సమీపిస్తుండడంతో మంచినీటి సరఫరా,పెండింగ్ బిల్లులు, రిజర్వాయర్లు, పనులు మొదలగు అంశాలపై సమీక్షించనున్నారు.
గ్రామాల్లో నీటి సరఫరాకి సంబంధించిన సమస్యలపై ప్రభుత్వం ఇప్పటికే పంచాయతీ కార్యదర్శుల నుంచి సమాచారం సేకరిస్తున్నది. కేసిఆర్ ప్రభుత్వ హయాంలో మిషన్ భగీరథ ప్రాజెక్టు నిర్వహణ గ్రామీణ నీటి సరఫరా శాఖ ఆధ్వర్యంలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల దానిని పంచాయతీలకు అప్పగించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించడం ప్రాధాన్యత సంతరించుకున్నది.