కేసీఆర్ ని ఫాలో అవుతున్న ముఖ్యమంత్రులు…!

-

తెలంగాణాలో కరోనా కేసులు చాలా వేగంగా పెరుగుతున్నాయి. 400 మార్క్ దాటాయి రాష్ట్రంలో కరోనా కేసులు. అదిలాబాద్ నుంచి ఖమ్మం జిల్లా వరకు భారీగా కేసులు నమోదు అవుతున్నాయి. ఎన్ని చర్యలు చేపడుతున్నా సరే ఇప్పుడు కరోనా వైరస్ మాత్రం కట్టడి అయ్యే పరిస్థితి కనపడటం లేదు. దీన్ని కట్టడి చేయడానికి వైద్య సిబ్బంది, అలాగే పోలీసులు పారిశుధ్య కార్మికులు తీవ్రంగా కష్టపడుతున్నారు.

దీనితో వారి కష్టాన్ని గుర్తించిన తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్… వారికి అదనపు వేతనాలు ఇవ్వాలని భావించారు. ఈ నిర్ణయాన్ని ఇప్పుడు మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు కూడా అమలు చెయ్యాలని భావిస్తున్నాయి. వారి కోసం అదనపు వేతనాలు ఇచ్చి వారి భద్రతకు కూడా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుని వారిని రక్షించడం ప్రోత్సహించడం వంటివి చెయ్యాలని భావిస్తున్నారు.

తెలంగాణాలో ఆర్ధిక ఇబ్బందులు ఉన్నా సరే రాష్ట్ర ప్రభుత్వం వారికి అదనపు వేతనం ఇస్తుంది. ఇప్పుడు మరింత అవసరం ఉంటుంది కాబట్టి వారి సేవలని వినియోగించుకోవాలి. లేకపోతే నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే ఇప్పుడు వారి విషయంలో ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే వెనక్కు తగ్గవద్దని అన్ని రాష్ట్రాలు కూడా ఒక నిర్ణయానికి వచ్చాయి. తెలంగాణా ప్రభుత్వ సూచనలను కూడా వారు తీసుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news