మొన్నామధ్య ఇంటర్నెట్ సెంటర్‌కి వెళ్ళి నెట్ బ్రౌజ్ చేసుకుంటూ ఉండగా నా పక్క క్యాబిన్ కి ఓ 11 ఏళ్ళ కుర్రాడు వచ్చి ” అన్నయ్యా మంచి గేమింగ్ సైట్స్ చెప్పవా ? ” అని అడిగితే నాకు తెలిసిన సైట్స్ పేర్లు కొన్ని చెప్పాను.
తర్వాత కొంత సమయానికి వాడి బాడీలాంగ్వేజ్‌లో నాకు కాస్త తేడా కనపడేసరికి అసలువాడేం చేస్తున్నాడా అని చూస్తే కుర్రాడు మాంఛి పోర్న్ వీడియోస్ చూస్తూ కనిపించాడు,, వెంటనే ” తమ్ముడూఊఊ……!!!!!! ” అని ధీర్ఘంగా సాగదీసి నవ్వుతూ వాడివైపు చూస్తే వాడు వాడు చేసిన పనికి సిగ్గుతో చచ్చిపోయి నావైపు చూడడానికి కూడా సాహసించలేక అలా నవ్వాలో ఏడవాలో తెలియనట్లుగా తెగ ఇబ్బందిగా కదిలాడు పాపం,,చూస్తే జాలి వేసింది.
చాలు,ఇక వాడికి ” నైతిక విలువలు – వాటి ప్రాముఖ్యత ” అనే అంశం మీద నేను నా అభిప్రాయాలతో రాయబోయే ఓ గొప్ప పుస్తకంలోని సారాన్ని బోధించేయక్కర్లేదని నేనూ ఇక ఏం మాట్లాడలేదు.
కానీ తర్వాత తర్వాత ఇంటికెళ్తూన్నప్పుడు అనిపించింది,,
మానసికంగా కూడా సరిగ్గా ఎదగని వీడికి 11 ఏళ్లకే స్త్రీ శరీరం ఇలా ఉంటుంది,సంభోగం అంటే ఇలా ఉంటుందని తెలిసిపోతే ఇక ఫీలింగ్స్ రెగ్యులర్ అయిపోవూ? ఇక తొలి ప్రేమ,,తొలి ఆకర్షణ,ఆషాడమాసపు విరహాలు లాంటి ఫీలింగ్స్ అనుభవించగలడా వాడు తర్వాతర్వాత?ఇక వాడి పెళ్ళి అయ్యాక వాడి పెళ్లాం ఏం ఆకర్షణీయంగా కనిపిస్తుంది?
ఎందుకు ఇలా పిల్లల్లో సెక్సువల్ అవుట్లెట్లు తొందర పెడుతున్నాయి? అని ఆలోచించి కొందరు పెద్దలతో చెప్పాను ఈ విషయాన్ని,,చర్చ అంతా మానసికవిశ్లేషణల పరంగా కొనసాగింది…వాళ్ళు అన్నారు ఇలా…!!!
” ఒకప్పుడు ఏదో వ్యాపకం ఉండేదిరా పిల్లలకి,సరైన ఆహారపు అలవాట్లు,ఓ పద్దతైన జీవన విధానం ఉండేది.విచ్చలవిడితనం ఉండేది కాదు.
ఇప్పుడా? ఎక్కువమంది తల్లితండ్రులకి పిల్లలని చదువూ చదువూ అని పోరడమే తెలుసు తప్ప వారికంటూ ఓ వ్యక్తిత్వం నేర్పాలని,,వాడి ఆలోచనా విధానంలో వస్తున్న మార్పులని పరిశీలించి వాడితో జాగ్రత్తగా మసులుకోవడం కానీ తెలియట్లేదు…పాపం అంత టైం కూడా వారికి ఉన్నట్లు లేదు,పిల్లల అవసరాలు తీర్చడమే ప్రేమ అనుకుంటున్నారుకాని వారి మానసిక అవసరాలు ఏమిటా? అని గుర్తించట్లేదు…
పిల్లలకి కూడా చదువు తప్ప వేరే వ్యాపకం లేక జీవితంలో ఏర్పడిన ఓ రకమైన శూన్యతని,,ఒంటరితనాన్ని పోగొట్టుకోడానికి వాళ్ళు ఇలా చాటింగ్‌లతో సమయాన్ని గడిపేస్తున్నారు. ప్రేమిస్తున్నాను అనే భావాన్ని ఎక్కువగా ప్రేమిస్తూ దానినే ప్రేమగా భావించి ఊహల్లో తేలిపోతున్నారు తప్ప నిజంగా ప్రేమించడం కూడా వారికి తెలియదు.అందులోనూ ఇప్పటి పిల్లల్లో సమాజం పెట్టిన నియమాలను తొక్కేసి మరీ అతిక్రమించెయ్యాలి అనే ఓ రకమైన కసి కనపడుతోంది కూడారా,అదో హీరోఇజంగా కూడా భావిస్తున్నారు మీ జనరేషన్లోని పిల్లలు ” అవే పిల్లలో ఈ రకమైన ప్రవర్తనకి కారణం అవుతున్నాయి అని అనుకుంటున్నాం ” అని అన్నారు…
వాళ్ల విశ్లేషణ నిజమో కాదో తెలియదు కానీ నిజంగా కాస్త బాదేస్తోంది ఎప్పుడైనా ఎవరైనా నా దగ్గర ఇలాంటి కబుర్లు చెప్తూంటే…
” నాకు బీటెక్ సెకండ్ ఇయర్లోనే సీల్ ఓపెన్ అయిపోయిందిరా ,నీకింకా ఓపెన్ కాకపోవడమేంటి ? ”
” మా ఇంటి దగ్గర 10వ క్లాస్ చదువుతున్న అమ్మాయి ఉందిరా,నన్ను కూడా లవ్(?) చేస్తోంది,,పై పై పనులకి ఒప్పుకుంటోంది కానీ అసలు మాటర్కి ఎలా ఒప్పించాలో తెలియట్లేదు,,
” ఓ రూం ఉంటే చూడరా మాకు ” ఇలా ఇలా అనే వాళ్ళు నేను డిప్లమా చదువుకునేటప్పుడు నేనెరిగిన కొందరు పరిచయస్తులు,నా సీనియర్లు…
ఏం చెప్పను వారితో ” ప్రేమంటే ఇదేదీ కాదని,,అది ఇలా ఎవరికిపడితే వారికి ఇచ్చేసే ఎస్ ఎం ఎస్ లాంటిది కాదని,,మనసావాచాకర్మణా మనం ఇష్టపడే వ్యక్తికి మనం రాసే అందమైన ప్రేమలేఖ లాంటిదని ” ఫిజికల్ వర్జినిటీతో పాటూ మెంటల్ వర్జినిటీ కూడా ముఖ్యమే ప్రేమలో ” అని..
ఇలా చెప్తే ఏదో పురాతన కాలంకి చెందిన వ్యక్తిలా చూస్తారే తప్ప 16 ఏళ్ళకి మనం లైంగిక అనుభవాలకి పాల్పడడమేంటి?అని కూడా ఆలోచించరు,,పైగా గొప్పగా చెప్తూ ఉంటారు ” మా బాబు వాళ్లకి తెలియకుండా సిగరెట్ ఎలా త్రాగుతున్నానో అని,,మందు కొట్టినా ఇంట్లో వాళ్ళకి తెలియకుండా ఎలా మానేజ్ చేశానో ” అని…జాలి పడాలో తెలియదు,,సమర్ధించాలో తెలియని చెత్త స్థితి ఇది.