నవంబర్ 27 శుక్రవారం: రాశి ఫలాలు మరియు పరిహారాలు

-

 

నవంబర్‌- 27- కార్తీకమాసం-శుక్రవారం.

మేషరాశి:ఈరోజు మీకు కొంత కష్టంగా గడుస్తుంది.

ఈరోజు మిశ్రమ ఫలితాలు వస్తాయి. కుటుంబ సభ్యుల ప్రవర్తన కారణంగా మీరు కొంచం అసంతృప్తి చెందుతారు. ఈరోజు మీకు కొంత కష్టంగా గడుస్తుంది. మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని బాధపెట్టొచ్చు. ఈరోజు మీరు ఇతరులకు ఇబ్బంది కలిగించే పనులు చేయాల్సి వస్తుంది. మనసంతా చికాకుగా ఉంటుంది. తగాదాలకు దూరంగా ఉంటె మంచిది. వైవాహికంగా వత్తిడితో కూడుకున్న రోజు.

పరిహారాలుః ఇష్టదేవత ఆరాధనతోపాటు శ్రీలక్ష్మీని ఆరాధించండి.

 

todays horoscope

వృషభరాశి:ఈరోజు మీరు పెద్ద ఒప్పందం చేసుకునే అవకాశం !

ఈరోజు అనుకూల ఫలితాలు వస్తాయి. ఈరోజు మీరు పెద్ద ఒప్పందం చేసుకునే అవకాశం ఉంది. ప్రతిదానిలోనూ మీరు లాభాన్ని ఆశిస్తారు. ఇన్నాళ్లు ఉరుకుల పరుగుల జీవితంతో సతమతమైన మీకు విజయం వస్తుంది. పనులు వ్యవహారాల్లో ఎలాంటి అడ్డంకులు వచ్చినా, సమర్ధవంతంగా పనులు పూర్తి చేస్తారు. వైవాహికంగా ఈరోజు బాగుంటుంది.

పరిహారాలుః శ్రీలక్ష్మీసూక్తపారాయణం మంచి ఫలితాన్నిస్తుంది.

 

మిధునరాశి:ఈరోజు అదృష్టం కలిసొస్తుంది !

సమాజంలో మీ కీర్తిప్రతిష్టలు పెరుగుతుంది. మీకున్న ఆర్ధిక సమస్యలు కొంతమేరకు గట్టెక్కుతాయి. మీ రంగంలో పని చేసే విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఈరోజు అదృష్టం కలిసొస్తుంది. వైవాహికంగా బాగుంటుంది.

పరిహారాలుః శ్రీశివాభిషేకం పసుపు, చందనంతో చేయండి.

 

కర్కాటకరాశి:ఈరోజు అనారోగ్య సమస్యలు జాగ్రత్త !

అనవసరంగా ఖర్చులు చేయవద్దు. ఈరోజు మీకు కొన్ని అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది జాగ్రత్తగా ఉండండి. కొన్ని కారణాల వలన ఈరోజు మీకు కోపం రావచ్చు. అయినా ఓపిక పట్టండి. సంతానం వల్ల ప్రయోజనాలు పొందుతారు.

పరిహారాలుః శ్రీసూక్తపారాయణం చదవండి లేదా వినండి.

 

 

సింహరాశి:ఈరోజు అదృష్టం కలిసి వస్తుంది !

ఈరోజు అనుకూల ఫలితాలు వస్తాయి. ఈరోజు అదృష్టం కలిసి వస్తుంది. వ్యాపార పరిస్థితులు మెరుగుపడతాయి. ధనలాభం కలిగే అవకాశం ఉంది. ఆరోగ్యంపై అప్రమత్తంగా ఉండాలి. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. వైవాహికంగా బాగుంటుంది.

పరిహారాలుః శ్రీదుర్గాదేవి ఆలయంలో ప్రసాదాన్ని సమర్పించండి.

 

కన్యరాశి:ఈరోజు కొత్త ప్రాజెక్టులను మొదలు పెట్టె అవకాశం !

మీకు అనుకూల ఫలితాలు. మీకిష్టమైనవారికి మంచి చేయడంలో ముందుంటారు. మీ పనులు పూర్తవుతాయి. ఈరోజు అదృష్టం మీ వెంటే ఉంటుంది. నూతన ప్రాజెక్టులను మొదలు పెట్టె అవకాశాలున్నాయి. స్నేహితులతో కలిసి చర్చల్లో పాల్గొంటారు. వైవాహికంగా బాగుంటుంది.

పరిహారాలుః శ్రీకనకధార స్తోత్రంను పారాయణం చేయండి.

 

తులరాశి:ఈరోజు శుభప్రదంగా ఉంటుంది !

ఈరాశి వారికి ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. వ్యాపార సంబంధ ఒప్పందాలను పొందే అవకాశం ఉంది. పెండింగ్‌ పనులు పూర్తిచేయడానికి మంచి సమయం. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. వైవాహికంగా సాఫీ జీవితం ఉంటుంది.

పరిహారాలుః శ్రీసూక్తపారాయణం చేయండి.

 

వృశ్చికరాశి:ఈరోజు మిశ్రమ ఫలవంతమైన రోజు !

ఈరోజు  మీఆలోచనలకు భిన్నం గా ఉంటుంది. మీరు మంచి అనుకున్న వాళ్ళే మీకు చెడు చేసే అవకాశం ఉంది. ఈరోజు మిశ్రమ ఫలవంతమైన రోజుగా గడుస్తుంది. వైవాహిక జీవితం సాధారణంగా ఉంటుంది. పిల్లల చదువు కోసం ధనాన్ని వెచ్చిస్తారు.

పరిహారాలుః రాహుకాలంలో దీపారాధన చేయండి.

 

ధనుస్సురాశి:ఈరోజు సంతోషంగా ఉంటారు !

ఈరోజు మిశ్రమ ఫలితాలు వస్తాయి. ఆరోగ్యం జాగ్రత్త.
గత కొన్ని రోజులుగా ఆటంకాలు ఎదురై పనులు చెడిపోతుండడంతో కలత చెందుతారు. ఈరోజు మాత్రం సంతోషంగా ఉంటారు. మానసికంగా ప్రశాంతంగా ఉండండి. వైవాహికంగా సాఫీగా సాగుతుంది.

పరిహారాలుః శ్రీ సంతోషిమాతా ఆరాధన మంచి ఫలితాన్నిస్తుంది.

 

మకరరాశి:ఈరోజు మీకు శుభవార్త అందుతుంది !

ఈరోజు మీకు శుభవార్త అందుతుంది. మేధో సామర్ధ్యం పెరిగే అవకాశం ఉంది. పెద్ద లాభం కలుగుతుంది. అది మీకు విజయం చేకూర్చవచ్చు. మీకు ఇష్టమైన వారు ఇంటికి వస్తారు. బంధువుల రాకతో సందడి. వైవాహికంగా సంతోషం ఉంటుంది.

పరిహారాలుః శ్రీసూక్త పారాయణం చేయండి.

 

కుంభరాశి:ఈరోజు మిశ్రమఫలితాలు వస్తాయి !

ఈరోజు మిశ్రమంగా ఉంటుంది. మీ రంగంలో అసంపూర్ణంగా ఉన్న పనులను పూర్తి చేస్తారు. మీ సొంత వ్యక్తుల్లోనే కొందరు మీ ఆందోళనలను పెంచుతారు. కుటుంబంలో చిన్న చిన్న ఇబ్బందులు రావచ్చు. ఆరోగ్య సమస్యలతో కుటుంబ సభ్యులలో ఆందోళన. వైవాహికంగా సాఫీగా బాగుంటుంది.

పరిహారాలుః శివుడికి పంచామృతాలతో అభిషేకం చేయండి.

 

మీనరాశి:ఈరోజు పనుల్లో ఆటంకాలు !

ఈరోజు అనుకూల ఫలితాలు. ఈరోజు అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి . పనికి అంతరాయం కలిగే అవకాశం ఉంది. ముఖ్యమైన పనులను ముందు పూర్తి చేసుకోవడం ఉత్తమం. వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది.

పరిహారాలుః శ్రీదుర్గాదేవి ఆరాధన మంచి ఫలితం వస్తుంది.

శ్రీ

 

Read more RELATED
Recommended to you

Latest news