వాస్తు: స్టడీ టేబుల్ విషయంలో ఈ మార్పులు చేస్తే పిల్లలకి ఎంతో మంచిది..!

-

వాస్తు ( Vasthu ) శాస్త్రం ప్రకారం అనుసరిస్తే నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా దూరమైపోయి పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది అయితే ఇంట్లో ఎలా అయితే వాస్తుని పాటిస్తామొ… పిల్లల విషయంలో కూడా వాస్తుని అనుసరించాలని పండితులు అంటున్నారు. పిల్లల చదువు పట్ల కూడా వాస్తు ప్రధాన పాత్ర పోషిస్తుందని ఇలా పండితులు చెబుతున్న విధంగా పాటించడం వల్ల వాళ్లలో ఏకాగ్రత పెరుగుతుందని.. చదువుపై ఆసక్తి పెరుగుతుందని అంటున్నారు.

 

kids study table vasthu | వాస్తు

చదువు పై ఫోకస్ పెట్టి మంచి మార్కులతో ఉత్తీర్ణులవుతారని కూడా చెప్పడం జరిగింది అయితే మరి ఇక ఆలస్యం ఎందుకు ఆ వాస్తు టిప్స్ గురించి ఇప్పుడు చూద్దాం. కొంతమంది పిల్లలకు చదువు పట్ల ఆసక్తి తక్కువగా ఉంటుంది. అటువంటప్పుడు తల్లిదండ్రులు పిల్లల యొక్క స్టడీ టేబుల్ ని మార్చితే మంచిది.

ఈ విధంగా స్టడీ టేబుల్ ని ఉంచడం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది. స్టడీ రూమ్ లో పిల్లలు చదువుకునే టేబుల్ ని వాయవ్యం వైపు ఉంచితే మంచిదని అంటున్నారు. ఈ దిక్కుల్లో ఉంచడం వల్ల వాళ్ళల్లో ఏకాగ్రత పెరుగుతుందని… చదువుకోవాలని ఆత్రుత కూడా వాళ్ళల్లో ఉంటుందని అంటున్నారు.

అలానే చదువుకునే టేబుల్ మీద అవసరమైన పుస్తకాలను, అవసరమైన సామాగ్రి మాత్రమే ఉంచాలని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి అని చెప్పారు. స్టడీ టేబుల్ పైన ఎక్కువ పుస్తకాలు పెట్టడం అసలు మంచిది కాదని.. ఇలా పెట్టడం వల్ల వాళ్లపై ఒత్తిడి పెరుగుతుందని, ఏకాగ్రత తగ్గుతుందని చెప్పారు. కాబట్టి ఈ విధంగా అనుసరించి పిల్లలకి చదువు పట్ల ఫోకస్ ని పెంచండి.

Read more RELATED
Recommended to you

Latest news