చైనా పన్నాగం: ఇండియా సరిహద్దులో బుల్లెట్‌ ట్రైన్‌ ప్రారంభం

-

ఇండియా మరియు డ్రాగన్ కంట్రీ చైనా మధ్య మొదటి నుంచి వివాదాలు ఉన్న సంగతి తెలిసిందే. సరిహద్దు విషయంలో ఎప్పుడూ దొంగ దెబ్బ తీయాలనే ఆలోచనతో చైనా అనేక కుట్రలు చేసింది. ఇందులో భాగంగా అనేక మంది భారత వైమానిక దళాన్ని పొట్టనపెట్టుకుంది ఈ డ్రాగన్ కంట్రీ. ఎప్పుడూ ఇండియా సరిహద్దులను ఆక్రమించు కోవాలని ప్రయత్నాలు చేస్తూనే ఉంది. అయితే తాజాగా మరో దుస్సాహసానికి పాల్పడింది చైనా. ఇండియా సరిహద్దులోకి బలగాలను వేగంగా తరలించేందుకు తగిన వనరులను సిద్ధం చేసుకుంటున్న డ్రాగన్.. ఆ దిశగా కార్యాచరణ కూడా వేగవంతం చేసింది. ఇందులో భాగంగానే అరుణాచల్ ప్రదేశ్ కు అత్యంత సమీపంలో ఉన్న టిబెట్ సరిహద్దు ప్రాంతానికి బుల్లెట్ ట్రైన్ ను ప్రారంభించింది.

దీంతో బలగాలను వేగంగా వాస్తవాధీన రేఖ వద్దకు చేర్చే అవకాశం కలుగుతుంది. టిబెట్ రాజధాని లాసా నుంచి నింగ్ చి ప్రాంతం వరకు ఎలక్ట్రిఫైడ్ బుల్లెట్ ట్రైన్ సేవలను చైనా శుక్రవారం ప్రారంభించింది. 435 కిలోమీటర్ల పొడవైన రైల్వే ట్రాక్ నిర్మాణ పనులను ప్రారంభించింది. టిబెట్ లో పూర్తిస్థాయిలో విద్యుదీకరణ ఇచ్చిన మొట్టమొదటి రైల్వే లైన్ ఇదే. అయితే టిబెట్ ప్రాంతంలో చైనా ప్రారంభించిన రెండో రైల్వే లైన్ ఇది. కాగా.. ఇండియాలోని అరుణాచల్ సరిహద్దుకు ఈ నింగ్ చి నగరం అత్యంత సమీపం ఉంటుంది. ఈ ప్రాంతం వరకు బుల్లెట్ ట్రైన్ ను చైనా తీసుకు రావడం గమనార్హం. ఇప్పటికే అరుణాచల్ ప్రదేశ్ టిబెట్ లోని దక్షిణ భాగమని చైనా వాదిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ బుల్లెట్ ట్రైన్ ద్వారా అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల్లో చైనా ఇంకా ఎలాంటి దుస్సాహసాలకు పాల్పడిందోనని ఆందోళన చెందుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news