ఏలూరు వింత రోగంపై నేషనల్ ఇన్సిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ తన నివేదికను సమర్పించింది. ఈ నివేదికలో కీలక అంశాలు వెల్లడించింది. 36 తాగునీటి శాంపిల్స్ పరిశీలించగా మూడింటిలో లెడ్, మూడింటిలో నికిల్ మోతాదు అత్యధికంగా ఉన్నట్లు గుర్తించామని నివేదికలో పేర్కొంది. 36 శాంపిల్స్ లోనూ మెర్కురీ మోతాదు ఎక్కువగా ఉండటం ఆశ్చర్యం కలిగించిందని నివేదికలో పేర్కొన్నారు. ఆర్గానో క్లోరిన్ ఎక్కడా బయటపడలేదని అయితే అన్నంలో మెర్కురీ మోతాదు అధికంగా ఉండటాన్ని గుర్తించామని పేర్కొన్నారు.
కూరగాయలని పరిశీలిస్తే ప్రమాదకరమైన ఆర్గానో ఫాస్పరస్ ఎక్కువగా కనిపించిందని పేర్కొన్నారు. 40 బ్లడ్ శాంపిల్స్ పరిశీలిస్తే 36 శాంపిల్స్ లో ఆర్గానో ఫాస్ఫరస్ మోతాదు అత్యధికంగా ఉందని పేర్కొన్నారు. అర్గానో క్లోరిన్ ఎక్కడా కనిపించలేదని గతంలో ఆక్వాకల్చర్ వల్ల ఈ తరహాలో కేసులు చైనాలో బయటపడినట్లు చెబుతున్నారు. మరి ఇక్కడ ఎలా జరిగింది అనేది తెలియాల్సి ఉంది. తాగునీటి కలుషితం వల్ల కూడా అవకాశం ఉండచ్చని నివేదికలో వెల్లడించింది.