ప్రస్తుతం ప్రపంచం అంతా ఇంటర్నెట్ మయం అయిపోయింది. ఇంటర్నెట్ ప్రపంచాన్ని ఓ కుగ్రామంగా మార్చివేసింది. ఈ క్రమంలోనే టెక్నాలజీని ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకుంటూ ముందుకు వెళ్లిపోతున్నారు. పరుగలు పెడుతోన్న పోటీ ప్రపంచంలో స్మార్ట్‌ఫోన్ ఎంట్రీతో ప్రపంచంలో ఎప్పుడు ఎక్కడ ఏం జరిగినా క్షణాల్లో తెలిసిపోతోంది. ఈ క్రమంలోనే టెక్నాలజీని కూడా అప్‌డేట్ చేసుకోవడం ముఖ్యం.
ఇక టెక్నాలజీని ఎప్పడికప్పుడు అప్‌డేట్ చేసుకుంటూ ముందుకు వెళ్లడంలో చైనాకు చైనాయే సాటి. అయితే ఇప్పటికే ప్రపంచంలో చాలా దేశాలకు 5G కే దిక్కులేదు. అయితే చైనా 6G కోసం ప్రయత్నాలు మొదలు పెట్టేసింది. ఇంకో ట్విస్ట్ ఏంటంటే కొన్ని దేశాల్లో ఇంకా 4G టెక్నాలజీ కూడా అమల్లో లేదు. మనదేశంలో చాలా పల్లెలు, ఏజెన్సీలో కూడా ఇంకా 4G కూడా పూర్తిగా అందుబాటులో లేదు. అయితే చైనా అప్పుడే 6G టెక్నాలజీ లైన్లో పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తోంది.
అత్యధిక దేశాలు 5 G టెక్నాలజీని అంది పుచ్చుకోవటానికి మరికొన్ని ఏళ్లు పట్టే పరిస్థితి. ఇలాంటి టైంలో అప్పుడే చైనా 6 G నెట్ వర్క్ మీద పరిశోధనలు చేయటం షురూ చేసింది చైనా. ఇందుకోసం అప్పుడే తాము పరిశోధనలు ప్రారంభిస్తున్నట్టు కూడా ప్రకటించింది. ఈ టెక్నాలజీలో సరికొత్త వైర్ లెస్ టెక్నాలజీని ప్రోత్సహించటమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెపుతోంది.
ప్రపంచంలో 5జీ సేవలు పరిచయం కావటానికి చాలా దేశాల్లో మరికొన్ని ఏళ్లు పడుతుందని అంచనాలు ఉన్న వేళ చైనా అప్పుడే 6 G కోసం రెడీ అవుతుంటే డ్రాగన్ దేశం టెక్నాలజీని అంది పుచ్చుకోవడంలో ఎంత ముందు ఉందో అర్థమవుతోంది.