క‌య్యానికి కాలుదువ్వుతున్న చైనా.. అస‌లు కార‌ణం ఇదే..!

-

డ్రాగ‌న్ కంట్రీ చైనా రూటే వేరు..! నిత్యం ఏదో ఒక దేశంతో గొడ‌వ‌ప‌డుతూనే ఉంటుంది. అయితే చైనా ఇలా చేయ‌డానికి ఓ బ‌ల‌మైన కార‌ణం ఉంద‌నే వాద‌న చాలా ఏళ్లుగా వినిపిస్తూనే ఉంది. ఆ దేశంలో విప‌త్క‌ర ప‌రిస్థితులు నెల‌కొన్న స‌మ‌యంలో అక్క‌డి ప్ర‌జ‌ల దృష్టిని మ‌ర‌ల్చ‌డానికి ఇత‌ర దేశాల‌తో స‌రిహ‌ద్దు వివాదాల‌ను సృష్టించి, క‌య్యానికి కాలుదువ్వుతుంద‌ని అంత‌ర్జాతీయంగా టాక్ ఉంది. ప్ర‌స్తుతం క‌రోనా వైర‌స్ కార‌ణంగా తీవ్ర‌మైన క‌ష్టాల్లో చైనా చిక్కుకుంది. ప్ర‌స్తుతం తీవ్ర ఆహార కొరత నెలకొంది. నిత్యావసర స‌రుకుల‌ ధరలు పెరుగుతున్నాయి. ఇప్ప‌టికే చాలా మంది ప్ర‌జ‌లు తిండి దొరక్క ఆక‌లితో అల్లాడుతున్నారంటూ అంత‌ర్జాతీయ మీడియాలో క‌థ‌నాలు వ‌స్తున్నాయి. దీంతో ఆ దేశ అధ్యక్షుడు జిన్‌ పింగ్‌ ‘కామ్రేడ్స్‌.. తక్కువ తినండి’ అంటూ దేశ ప్రజలకు పిలుపునిచ్చారని చెబుతున్నారు విశ్లేష‌కులు. ఆపరేషన్‌ క్లీన్‌ పేరిట అధ్య‌క్షుడు ఈ ఉద్యమాన్ని ప్రారంభించారు.

1962లో చైనాను పారిశ్రామికంగా వృద్ధి చేయడానికి నాటి ఆ దేశ అధినేత మావో జెడాంగ్‌ ‘గ్రేట్‌ లీప్‌ ఫార్వర్డ్‌’ ఉద్యమానికి పిలుపునిచ్చారని, వ్య‌వ‌సాయంలో దిగుబడులు తగ్గి ఆహారం దొరక్క కోట్లాది మంది చనిపోయారని.. ఆ ఆకలి చావుల నుంచి ప్రపంచం దృష్టి మరల్చడానికి అప్పుడు మావో సరిహద్దు వివాదాలను అస్త్రంగా ఎంచుకొన్నారని ప‌లువురు విశ్లేష‌కులు చెబుతున్నారు. ఈ నేప‌థ్యంలోనే 1962లో ఇండియాతో కయ్యానికి దిగారని.. ఇప్పుడు జిన్‌పింగ్‌ అదే తరహాలో భారత్‌తో సరిహద్దుల వద్ద ఉద్రిక్తతలను పెంచుతున్నారని అంటున్నారు.

అయితే.. చైనాలో ప్ర‌స్తుతం ఆహార సంక్షోభానికి అమెరికాతో వాణిజ్య యుద్ధం మొదటి కారణమైతే, తర్వాత కరోనా వైర‌స్‌, వరదలు కారణమయ్యాయి. ముఖ్యంగా ప్లాస్టిక్‌ ఉత్పత్తుల ఎగుమతుల్లో అగ్ర‌భాగాన‌ ఉన్న చైనా ఆహార రంగంలో మాత్రం 30శాతం దిగుమతుల మీదనే ఆధారపడుతోంది. కరోనా వల్ల దిగుమతులు ఆగిపోయాయి. దీనికి తోడు ఈ ఏడు యాంగ్జీ నది వరదలతో పోటెత్తింది. పంటలు బాగా దెబ్బతిన్నాయి. పంట దిగుబడులు తగ్గి, ఆహార కొరత ఇంకొంత కాలం కొనసాగనున్నది. ఈ నేపథ్యంలో సంక్షోభాన్ని తీర్చలేని ప్రభుత్వం తక్కువ తినాలని ప్రజలకు చెప్తున్నది. ఈ ప‌రిస్థితులు ఎలాంటి ప‌రిణామాల‌కు దారితీస్తాయో చూడాలి మ‌రి.

Read more RELATED
Recommended to you

Latest news