మెట్రో ఎక్కబోతున్నారా…? అయితే ఇది మీ కోసమే.. పక్కా తెలుసుకోండి..!

-

కరోనా నేపథ్యంలో లాక్‌డౌన్ విధించడంతో ప్రజా రవాణా వ్యవస్థ స్తంభించింది. సిటీలో ఎక్కడికి వెళ్లాలన్నా సొంత వాహనం ఉంటేనే సాధ్యం అవుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ అన్‌లాక్ 4 గైడ్‌లైన్స్‌ లో భాగంగా మెట్రో రైళ్లకు అనుమతినిచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా.. మెట్రో రైలు సర్వీసులకు సంబంధించిన మార్గదర్శకాలను కేంద్రమంత్రి హర్దీప్‌సింగ్‌ విడుదల చేశారు. ఒక లైను కంటే ఎక్కువ లైన్లు ఉంటే దశలవారీగానే ప్రారంభించాలని ఆదేశించారు. మాస్క్‌ లు, భౌతిక దూరం, శానిటైజర్లు తప్పనిసరని ఆయన చెప్పారు. కట్టడి ప్రాంతాల్లో ఉన్న స్టేషన్లను మూసివేయాలని తెలిపారు.

ఆన్‌లైన్‌ బుకింగ్‌, మెట్రో కార్డులను ఉపయోగించాలని, టోకెన్లను ఇచ్చేటప్పుడు వాటిని శానిటైజ్‌ చేయాలని స్పష్టం చేశారు. అలాగే రైలు స్టేషన్‌లో వచ్చి ఆగినప్పుడు రైలు ఎక్కి, దిగే ప్రయాణికుల మధ్య తోపులాట లేకుండా తగినంత సమయం రైలు ఆగేలా అధికారులు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. కాగా, కేంద్రం విడుదల చేసిన అన్‌లాక్ మార్గదర్శకాల ప్రకారం సెప్టెంబర్ 7 నుంచి 12వ తేదీలోగా విడతల వారీగా గ్రేడెడ్ పద్ధతిలో దేశంలోని అన్ని మెట్రో సేవలు అందుబాటులోకి రానున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news