సీఎం జగన్‌కు ప్రజలపై నమ్మకం ఉంటే చంద్రబాబు సవాల్‌ను స్వీకరించాలని టిడిపి నేత చినరాజప్ప అన్నారు. ఎన్నికల ముందు రాజధానిగా అమరావతి ఉంటుందని చెప్పి.. ఇప్పుడు మాట తప్పినందుకు రాజీనామా చేసి ప్రజల తీర్పు కోరాలని డిమాండ్ చేశారు. రాజధానిగా అమరావతి ఉంటేనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని ప్రజలు నమ్ముతున్నారని అన్నారు. అమరావతి రాజధాని మార్పు అనే అంశం 5 కోట్ల మంది రాష్ట్ర ప్రజల సమస్య అని అన్నారు. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి అమరావతి రాజధానిగా అన్ని విధాల బాగుంటుందని రాష్ట్ర ప్రజలు ఆకాంక్షించారని ఆయన గుర్తించారు. కాని ప్రజల మనోభావాలకు విరుద్ధంగా 151 సీట్లు సాధించామనే గర్వంతోనే జగన్ రాజధాని మార్పు నిర్ణయం తీసుకున్నారని ఆయన ఆరోపించారు.
నిన్న చంద్రబాబు నాయుడు సీఎం జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి పై తారా స్థాయిలో విరుచుకుపడ్డారు. 48 గంటల్లో రాజీనామా చేసి ఎన్నికలకు సిద్ధం అవ్వండి అంటూ సవాల్ విసిరారు. ఈ నేపథ్యంలోనే చినరాజప్ప అధికార పార్టీ నాయకులకు ఉద్దేశించి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. రాజధాని వికేంద్రీకరణ చిచ్చు ఇంకా ఎన్ని రాజకీయ చర్చలకు దారి తీస్తుందో చూస్తూ ఉండాల్సిందే.