సుశాంత్ కేసులో కొత్త మలుపు.. సిబిఐ చేతికి కేసు..!

-

బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ ఆత్మహత్య బాలీవుడ్ లో ఎన్నో ప్రకంపనలు సృష్టించిన విషయం తెలిసిందే. సుశాంత్ ది మొదట ఆత్మహత్య అనుకున్నప్పటికీ ఆ తర్వాత హత్య అంటూ పలు ఆరోపణలు రావడంతో..సుశాంత్ మరణం కేసు రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. ఆత్మ హత్య కేసును సీబీఐకి అప్పగించాలి అంటూ అభిమానులు డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా సుశాంత్ ఆత్మహత్య కేసును సిబిఐకి సిఫార్సు చేస్తున్నట్లు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అధికారికంగా తెలిపారు.

సుశాంత్ సింగ్ రాజ్పుత్ తండ్రి కేకే సింగ్.., తన కొడుకు ఆత్మహత్య కేసు ను సీబీఐ కి అప్పగించాలి అంటూ బీహార్ ప్రభుత్వాన్ని కోరిన నేపథ్యంలో… ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.తాజాగా మీడియాతో మాట్లాడిన ముఖ్యమంత్రి నితీష్ కుమార్… సుశాంత్ ఆత్మహత్య కేసును సీబీఐకి అప్పగించనున్నట్టు తెలిపారు, కాగా ప్రస్తుతం సుశాంత్ ఆత్మహత్య కేసు సిబిఐ కి వెళ్లడం మరింత చర్చనీయాంశంగా మారింది. ఈ కేసులో సిబిఐ విచారణలో ఎలాంటి నిజాలు బయటపడుతాయన్నది చూడాలి మరి.

Read more RELATED
Recommended to you

Latest news