Pawan Kalyan: కనకదుర్గ ఆలయంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆసక్తికర కార్యానికి శ్రీకారం చుట్టారు. కనకదుర్గ ఆలయంలో మెట్లు కడిగి.. హాట్ టాపిక్ అయ్యారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ… ప్రాయశ్చిత్త దీక్షకు ఇవాళ మూడోరోజు అన్నారు.
మేము రామభక్తులం.. ఆంజనేయస్వామిని పూజిస్తామని ప్రకటించారు. సగటు హిందువుకు ఎలాంటి భయం, ఇతర మతాల పైన ద్వేషం ఉండదని తెలిపారు. కనకదుర్గమ్మ రధం సింహాలు మాయమైతే వైసీపీ నేతలు అపహాస్యం చేసారని ఆగ్రహించారు. వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకరరెడ్డి మతం పుచ్చుకున్నారా లేదా నాకు తెలీదని తెలిపారు. జగన్ ను నేను ఎత్తి చూపడం లేదు… మీ సమయంలో జరిగిన అపచారం పై స్పందించాలని కోరారు. రాజకీయాలలో క్రిమినల్స్, రాజ్యాంగం బాగుండాలి అని పాటుపడుతున్నామన్నారు. సెక్యులరిజం అన్ని వైపుల నుంచీ రావాలని.. సాటి హిందువులు తోటి హిందువులను తిట్టడం ఆక్షేపణీయం అని తెలిపారు.