కల్తీ నెయ్యి వివాదం..యాదాద్రి టెంపుల్ అధికారుల కీలక నిర్ణయం

-

తిరుమలలో కల్తీ నెయ్యి వ్యవహారం దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే.దీనిపై పార్టీలకు అతీతంగా అన్ని రాజకీయ పార్టీలు స్పందిస్తున్నాయి. ఇప్పటికే ఈ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వంతో పాటు అటు కేంద్రం కూడా సీరియస్ అయింది.నెయ్యి సరఫరా చేసిన తమిళ కంపెనీకి ఏపీ ప్రభుత్వం షోకాజ్‌ నోటీసులు కూడా జారీ చేసింది.ఆలయానికి సరఫరా చేసిన నెయ్యి నాణ్యతా పరీక్షల్లో విఫలం అయిన విషయం తెలిసిందే.

దీంతో నెయ్యి సరఫరా చేసిన కంపెనీకి ప్రభుత్వం షోకాజ్‌ నోటీసులు పంపింది. కల్తీ నెయ్యి వివాదం వేళ తెలంగాణలోని యాదాద్రి ఆలయ అధికారులు అప్రమత్తమయ్యారు. యాదాద్రి లక్ష్మినరసింహస్వామి ఆలయంలో లడ్డూ తయారీకి వినియోగించే నెయ్యిని పరీక్షల నిమిత్తం హైదరాబాద్‌‌లోని ల్యాబ్‌కు పంపారు.మదర్ డెయిరీ యాదాద్రి ఆలయానికి నెయ్యిని సరఫరా చేస్తోంది. లడ్డూతో పాటు ఆలయంలో అమ్మే పులిహోర పైనా అధికారులు ఫోకస్ పెట్టారు. దీంతోపాటు రెండు తెలుగు రాష్ట్రాల్లోని టెంపుల్స్ ప్రసాదాల నాణ్యతపై కూడా అధికారులు దృష్టి సారించాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version