ఏపీకి రాజధాని ఏది అంటే సమాధానం చెప్పలేని పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది. ఈ తరుణంలో మాజీ ఎంపీ చింతా మోహన్ కొత్త పల్లవి ఆలపిస్తున్నారు. ఏపీ సీఎం జగన్ పాలనలో నియంత పోకడలున్నాయని కాంగ్రెస్ నేత చింతా మోహన్ విమర్శించారు. తిరుపతిని రాజధానిని చేయాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. 1953లోనే తిరుపతిని రాజధానిని చేయాలని నిర్ణయించారన్నారు. ఇప్పటికి 4 సార్లు మారిన రాజధాని ఐదోసారి మారడం ఖాయమన్నారు.
కర్నూలుకు హైకోర్టు వచ్చే అవకాశం లేదని చింతా మోహన్ పేర్కొన్నారు. ఆంధ్రుల ఆత్మగౌరవం అమిత్ షా ఇంటి చుట్టూ తిరుగుతోందన్నారు. జగన్, చంద్రబాబులు అమిత్ షా జేబులో ఉన్నారని చింతా మోహన్ ఎద్దేవా చేశారు. మరియు తాజా పరిణామాల నేపథ్యంలో, తిరుపతి నగరమే ఏపీకి సరైన రాజధాని అని, 1953లోనే తిరుపతిని రాజధాని చేయాలనుకున్నారని చింతా మోహన్ వెల్లడించారు.