దెందులూరు మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్ అరెస్ట్ అయ్యారు. నిన్న దెందులూరు నియోజకవర్గ పరిధిలో ఉన్న బీ. సింగవరంలో చింతమనేని ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అయితే ఈ సమయంలో వైసీపీ – టీడీపీ వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో వైసీపీ వర్గీయులు చింతమనేని తమ మీద దాడి చేశాడని ఫిర్యాదు చేశారు.
ఈ క్రమంలో పంచాయతీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏలూరు మండలం మాదేపల్లికి వచ్చిన ఆయనను అరెస్టు చేసి స్టేషన్‌కు తీసుకువెళ్లారు. అయితే కేసుతో సంబంధం లేకపోయినా తమ నేతను అరెస్ట్ చేశారని టీడీపీ నేతలు వాదిస్తున్నారు. ఇక గతంలో కూడా జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన కొద్దిరోజులకే చింతమనేనిని జైలుకు పంపారు. పాత కేసులు తోడి మరీ జైలుకు పంపడం అప్పట్లో సంచలనం రేపింది. ఇక ఎన్నికల నేపథ్యంలో ఆయన అరెస్ట్ కావడం చర్చనీయాంశంగా మారింది.