పవన్‌ వ్యాఖ్యలపై జగన్‌కి చిరంజీవి సారీ చెప్పాడు : పోసాని

-

పవన్ కళ్యాణ్ చేసిన ఎన్నో పొరపాట్లకు ఆయన తరఫున అన్నయ్య చిరంజీవి చాలామందికి ఫోన్లు చేసి క్షమాపణలు చెప్పారని సినీ నటుడు, ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫిల్మ్, టెలివిజన్, థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోసాని కృష్ణమురళి అన్నారు. పేర్ని నాని లాంటి నాయకులకు ఫోన్లు చేసి.. తెలియక తప్పుగా మాట్లాడులే క్షమించండి అని చిరంజీవి అన్నారని వెల్లడించారు. సిసలైన మనిషి అంటే చిరంజీవి అని కొనియాడారు.

ఈ క్రమంలోనే పోసాని కృష్ణ మురళి సైతం పవన్ కల్యాణ్‌పై నిప్పులు చెరిగారు.తాజాగా పోసాని మీడియాతో మాట్లాడుతూ.. ‘నిజంగా ప్రమాణసాక్షిగా చెప్తున్న నీ మీదా నాకు కోపంతో కాదు.. ఎన్ని పొరపాట్లు మళ్లీ మళ్లీ చేస్తావని. నువ్వు చేసిన చాలా పొరపాట్ల కారణంగా చిరంజీవి ఈ రోజు నీ తరుఫున క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. తెలియక పొరపాటున అన్నాడండి అని పేర్ని నానికి, సీఎం జగన్‌కి కాల్ చేసి సారీ చెప్పాడు. మావాడు తెలియక మాట్లాడాడు క్షమించండి అని అడిగారు’’ అంటూ చెప్పుకొచ్చారు పోసాని. దీనికి సంబంధించిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version