చిరంజీవి, బాలయ్య ఇద్దరిలో నిలిచేదెవరో! గెలిచేదెవరో..!!

-

సంక్రాంతి పండుగ తెలుగు ప్రాంతాలలో భారీ ఎత్తున జరిగే పెద్ద పండుగ. అప్పుడు జనాలు కోళ్ల పందాలతో మంచి జోష్ లో వుంటారు. అప్పుడే మన హీరోల సినిమాలు కూడా పందెం కోళ్ళులా తలపడతాయి. చాలా మంది షూటింగ్ త్వరగా పూర్తి చేసి సంక్రాంతి బరిలో వుండాలని కోరుకుంటారు. ఇప్పుడు ఇలాంటి పరిస్థితి మెగాస్టార్ చిరంజీవి మరియు బాలయ్య బాబు మధ్య నెలకొంది. ఇది ఎటు వైపు దారి తీస్తుందో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

కేఎస్ రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న #MEGA154  సినిమా షూటింగ్  దశలో వుంది.ఈ సినిమాను  సంక్రాంతి సీజన్లో రిలీజ్ చేస్తామని సినిమా యూనిట్ ముందే చెప్పింది. బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న #NBK107 సినిమా షూటింగ్ కూడా చివరి దశకు చేరుకుంది. దీనితో  ఇప్పుడు బాలయ్య బాబు కూడా సంక్రాంతి బరిలో వుండాలని కోరుకుంటున్నారట.

దీనితో ఎవరు తగ్గుతారు అని అందరూ చర్చించుకోవడం చేస్తున్నారు. అందరికంటే ఈతల నొప్పి మైత్రీ మూవీ మేకర్స్ కే ఎక్కువ వుంది . ఎందుకంటే ఈ రెండు సినిమాలను మైత్రీ వారే నిర్మిస్తున్నారు. ఈ సమస్యను ఎలా పరిష్కరించాలి అని తీవ్రంగా ఆలోచిస్తున్నారట. ఓకే సారి రెండు సినిమాలు వస్తే ,మైత్రీ వారు తీవ్రంగా నష్టపోతారు. బాలయ్య ను కొంచెం ముందుగా డిసెంబర్ నెలలో రమ్మని రిక్వెస్ట్ చేస్తున్నారట. ఇంకా బాలయ్య నుండి కన్ఫర్మ్ రాలేదట.ఈ విషయంలో నిర్మాతలు తెగ కంగారు  పడుతున్నారని సోషల్ మీడియాలో వార్తలు హల్చెల్ చేస్తున్నాయి. వీరిలో ఎవరు సంక్రాంతి బెర్త్ దక్కించుకుంటారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version