ఆమెతో నటించడమంటే నాకు చాలా ఇష్టం : చిరంజీవి

-

ప్రముఖ సింగ్ స్మిత హోస్టుగా వ్యవహరిస్తున్న షో నిజం. ఈ కార్యక్రమం సోనీ లివ్ ఓటీటీలో ప్రసారం అవుతోంది. ఈ కార్యక్రమానికి మొదటి గెస్టుగా మెగాస్టార్ చిరంజీవి వచ్చారు. దీనికి సంబంధించిన ఎపిసోడ్ ఇప్పుడు స్ట్రీమింగ్ అవుతోంది. ఈ కార్యక్రమంలో స్మిత.. చిరు జీవితంలో జరిగిన చాలా విషయాలను అడిగారు. దానికి చిరు నిజాయతీగా సమాధానమిచ్చారు.

ఇందులో భాగంగానే..  తనతో కలిసి నటించిన హీరోయిన్స్‌లో ఫేవరెట్‌ ఎవరు? అని స్మిత చిరంజీవిని అడిగారు. వెంటనే దానికి చిరు సమాధానమిస్తూ.. రాధ, రాధిక, విజయశాంతి, శ్రీదేవి పేర్లను చెప్పారు. అంతేకాదు దానికి సరైన వివరణ కూడా ఇచ్చారు.

‘‘ప్రతి ఒక్కరికీ వారికి సొంతమైన క్వాలిటీ ఉంది. అందుకే ఒకరి పేరు చెప్పమంటే చెప్పలేకపోతున్నా. సహజంగా నటిస్తూ, చెప్పింది చెప్పినట్లు చేసుకుంటూ వెళ్లే తత్వం రాధికకు ఉంది. డ్యాన్స్‌లో రాధ బెస్ట్‌. నువ్వా-నేనా అన్నట్లు చేస్తారు. ఆ విషయంలో గట్టి పోటీ ఇచ్చేవారు. ఇక విజయశాంతి సినిమాలో పాత్ర కోసం తనని తాను మలుచుకుంటారు. తెరపై మరింత పవర్‌ఫుల్‌గా కనిపించేలా నటిస్తారు. అంతేకాదు, ఏ పాత్రనైనా సులభంగా చేయగలరు. వీళ్లందరినీ పక్కన పెడితే, శ్రీదేవి డ్యాన్స్‌ చూస్తే వావ్‌ అనాల్సిందే. ఇతర హీరోయిన్స్‌తో పోలిస్తే శ్రీదేవితో కలిసి నటించడాన్ని నేను ఎక్కువ ఆస్వాదించా’’ అని చిరంజీవి చెప్పుకొచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news