గ్రాండ్ గా కియారా – సిద్దార్థ్ వెడ్డింగ్ రిసెప్షన్.. తరలివచ్చిన సినీ లోకం.!

-

ఇన్ని రోజులు రహస్యంగా ప్రేమించుకున్న ఈ ప్రేమ జంట ఎట్టకేలకు ఫిబ్రవరి 7వ తేదీన పెళ్లి బంధంతో ఒక్కటి అయ్యారు.. కియారా అద్వానీ, సిద్ధార్థ మల్హోత్రా చాలా రోజులుగా ప్రేమించుకుంటున్న విషయం తెలిసిందే. కానీ ఎక్కడ కూడా తమ ప్రేమ విషయాన్ని బయట పెట్టలేదు. ఎప్పుడు అడిగినా తమ మధ్య ఏం లేదంటూ బుకాయిస్తూ వచ్చారు . పెద్దగా హడావిడి చేయకుండా చాలా సింపుల్ గా పెళ్లి చేసేసుకుంది ఈ జంట. ఒక రకంగా చెప్పాలంటే 10 కోట్ల రూపాయల ఖర్చుతో అంగరంగ వైభవంగా రాజస్థాన్లోని జై సల్మేరు సూర్యఘర్ ప్యాలెస్ లో ఘనంగా జరిగింది వీరి వివాహం.

ఇకపోతే తమ పెళ్లి జ్ఞాపకాలు పదిలంగా ఉండేలా ఈ హిస్టారికల్ ప్లేస్ లో తమ వెడ్డింగ్ జరుపుకుంది.. పెళ్లి తర్వాత అత్తగారింట్లో అడుగు కూడా పెట్టేసింది టిఆర్ఎస్ కొత్త పెళ్లి కూతురికి ఘనంగా స్వాగతం పలికారు సిద్ధార్థ ఫ్యామిలీ.. ఇకపోతే అదే రోజు రాత్రి బంధువుల మధ్య రిసెప్షన్ వేడుక బాగా జరిగినట్లు తెలుస్తోంది..ఈ క్రమంలోని ఫిలిం ఇండస్ట్రీ వారి కోసం కూడా గ్రాండ్ గా ముంబైలో రిసెప్షన్ ఏర్పాటు చేశారు కియారా – సిద్దార్థ్.

ముంబైలోని ఒక స్టార్ హోటల్లో నిన్న రాత్రి రిసెప్షన్ చాలా ఘనంగా జరిగినట్లు అందుకు సంబంధించిన ఫోటోలో చాలా వైరల్ అవుతున్నాయి. అయితే ఈ రిసెప్షన్ ఏర్పాట్లు స్వయంగా కొత్త జంట పర్యవేక్షించారు దీనికోసం ముందు రోజే అంటే శనివారం రోజు ఢిల్లీ నుంచి ముంబై వచ్చినట్లు తెలుస్తోంది. ఈ గ్రాండ్ వెడ్డింగ్ రిసెప్షన్కు బాలీవుడ్ సెలబ్రిటీలు, పలువురు పారిశ్రామికవేత్తలు కూడా హాజరయ్యారు.. టాలీవుడ్ బ్యూటీ రాశీఖన్నా కూడా ఈ రిసెప్షన్ లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మొత్తానికి అయితే ఈ కొత్త జంటకు పలువురు సెలబ్రిటీలు శుభాకాంక్షలు తెలియజేశారు.

Read more RELATED
Recommended to you

Latest news