రామ్ చరణ్ పుట్టినప్పుడు సహజంగానే ఉప్పొంగిపోయానంటూ చిరంజీవి ఎమోషనల్ అయ్యాడు. మార్చి 27 మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా చిరంజీవి కాసేపటి క్రితమే ఓ పోస్ట్ చేశాడు. ఉగాది రోజున సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చిన చిరు.. ఫుల్ జోష్‌లో ఉన్నాడు. ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన చిరు.. తన అభిప్రాయాలను, భావాలను అభిమానులతో పంచుకుంటున్నాడు.
చిరు టైమింగ్‌కు నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. అందర్నీ పేరు పేరునా పలకరించడం, సెటైరికల్‌గా స్పందించడం, హెల్దీ కామెడీని పంచడంతో ఇన్నాళ్లు చిరు టైమింగ్‌ను చాలా మిస్ అయ్యామని అభిమానులు చాలా ఫీలవుతున్నారు. ఇన్‌స్టాలో మొదటి పోస్ట్.. అమ్మ అంజనాదేవీ గురించి చేసి అందర్నీ టచ్ చేశాడు. ఇక రెండో పోస్ట్‌గా రామ్ చరణ్ గురించి చేశాడు.
రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా చిరు పోస్ట్ చేస్తూ.. నాటి సంగతులను గుర్తు చేసుకున్నాడు. ‘రామ్ చరణ్ పుట్టినప్పుడు సహజంగానే ఉప్పొంగిపోయానని, అయితే ఆనాడు నాకు ఆ విషయం అర్థం కాలేదని, చరణ్ ఎందుకు ప్రపంచ రంగస్థల దినోత్సవం (వరల్డ్ థియేటర్ డే) రోజునే పుట్టాడని.. అయితే చేపకు ఈదడం ఎలా అబ్బిందో.. అలా రామ్ చరణ్ నటనను అలవర్చుకున్నాడు.. అన్ని పండుగల్లోకెల్లా రామ్ చరణ్ పుట్టిన రోజు అనేది ప్రత్యేకమైన పండుగ’.. అంటూ రామ్ చరణ్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపాడు.