ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిన్న పిఠాపురంలో నిర్వహించిన జనసేన ఆవిర్భావ జయకేతన సభలో పవర్ ఫుల్ స్పీచ్ ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా తన తమ్ముడు పవన్ ప్రసంగంపై ఆయన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా స్పందించారు.
‘జనసేన జయకేతన సభలో నీ స్పీచ్‌కు మంత్రముగ్ధుడనయ్యాను. సభకొచ్చిన అశేష జనసంద్రం లానే నా మనసు ఉప్పొగింది. ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చే నాయకుడొచ్చడన్న నమ్మకం మరింత బలపడింది. ప్రజా సంక్షేమం కోసం ఉద్యమస్ఫూర్తితో నీజైత్రయాత్ర నిర్వఘంగా కొనసాగాలని ఆశీర్వదిస్తున్నాను. జనసైనికులందరికీ హృదయ పూర్వక శుభాకాంక్షలు!??’ అని రాసుకొచ్చారు.