BREAKING : అంతర్జాతీయ క్రికెట్‌ కు రిటైర్మెంట్‌ ప్రకటించిన క్రిస్ మోరిస్

-

మరో దక్షిణాప్రికా క్రికెటర్‌ తన అంతర్జాతీయ క్రికెట్‌ కు రిటైర్మెంట్‌ ప్రకటించాడు. దక్షిణాప్రికా ఆల్‌ రౌండర్‌ క్రిస్‌ మోరీస్‌.. కాసేపటి క్రితమే.. తన అంతర్జాతీయ క్రికెట్‌ కు రిటైర్మెంట్‌ ప్రకటించాడు. ఈ మేరకు తన ఇన్‌ స్టాగ్రామ్‌ లో ఓ పోస్ట్‌ చేశాడు. తాను మూడు ఫార్మాట్ల నుంచి కూడా తప్పుకుంటున్నట్లు స్పష్టం చేశారు క్రిస్‌ మోరిస్‌.

తన కెరీర్‌ లో ఇప్పటి వరకు తనకు సపోర్ట్‌ చేసిన వారందరికీ కృతజ్ఞతలు చెప్పారు క్రిస్ మోరిస్. తన రిటైర్మెంట్‌ అనంతరం.. టైటాన్స్‌ జట్టుకు కోచ్‌ గా వ్యహరిస్తానని కూడా క్రిస్‌ మోరిస్‌ వెల్లడించారు. అంతర్జాతీయ క్రికెట్‌ కు రిటైర్మెంట్‌ ప్రకటించడం చాలా బాధగా ఉందని.. కానీ తన వ్యక్తిగత కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ప్రకటించారు మోరిస్‌. కాగా… ఇప్పటి వరకు 4 టెస్టులు, 42 వన్డేలు, 23 అంతర్జాతీయ టీ 20 లు ఆడాడు క్రిస్‌ మోరిస్‌. అంతేకాదు.. ఏకంగా 81 ఐపీఎల్‌ మ్యాచ్‌ లు ఆడాడు మోరిస్. ప్రస్తుతం క్రిస్‌ మోరిస్‌ రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news