ఈ వారంలోనే న్యూఢిల్లీలో కొవిడ్-19 కేసులు పీక్‌కు చేరుకొనే అవకాశం ఉన్నదని, ఆ తర్వాత థర్డ్ వేవ్ ఇన్‌ఫెక్షన్స్ పడిపోయే అవకాశం ఉన్నదని ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్ తెలిపారు. దేశ రాజధానిలో సోమవారం 19000 కొత్త కేసులు వెలుగు చూడగా, ఆదివారం వీటి సంఖ్య 22,751గా ఉండటం గమనార్హం.
ఇప్పటికే కేసుల సంఖ్య పీక్‌కు చేరుకున్నది లేదా ఒకటి రెండు రోజుల్లో చేరుకోవచ్చు. కచ్చితంగా ఈవారంలోనే కొవిడ్-19 ఇన్‌ఫెక్షన్ పీక్‌కు చేరుకుంటుంది. ఆ తర్వాత కేసుల సంఖ్య తగ్గడం ప్రారంభమవుతుంది. కొవిడ్-19 పట్ల ప్రజలు అలసత్వం ప్రదర్శించుకుండా ఉండటం కోసం మరోసారి కర్ఫ్యూ విధిస్తాం అని సత్యేంద్ర జైన్ పేర్కొన్నారు.
న్యూఢిల్లీలో టెస్టు చేసిన ప్రతి నలుగురిలో ఒకరికి కొవిడ్-19 పాజిటివ్‌గా వస్తున్నది. సోమవారం పాజిటివిటీ రేటు 25శాతానికి చేరుకున్నది. గత ఏడాది మే 5 తర్వాత ఈ స్థాయిలో ఇన్‌ఫెక్షన్ రేటు ఉండటం ఇదే మొదటిసారి.