సక్సెస్ స్టోరీ: ఈమెని ఆదర్శంగా తీసుకుంటే ప్రతీ మహిళా సక్సెస్ అవుతుంది..!

-

పెద్ద పెద్ద వాళ్ళు బిజినెస్లు చేస్తూ… లాస్ వస్తే వాటిని కట్టకుండా విదేశాలకు వెళ్ళి పోతూ ఉంటారు,, ఈ విషయం మనం ఒక సారి కాదు రెండు సార్లు కాదు ఎన్నో సార్లు చూసాము. చాలా మంది ఇలానే చేశారు.. చేస్తున్నారు. కానీ ఈమె మాత్రం నిజంగా ఎందరికో ఆదర్శం అని చెప్పాలి. కేఫ్ కాఫీ డే తో అప్పులు చేసి మరణించిన సిద్దార్థ గురించి మనకి తెలుసు.

తన భర్త చేసిన అప్పులని ఆమె కష్టపడి తీరుస్తోంది. ఆమె కావాలనుకుంటే చాలా మంది లాగ విదేశాలకు వెళ్లి పోయి స్థిరపడొచ్చు. లేదా నాకేంటి సంబంధం అని ఆమె తన దారిలో తానూ వెళ్లిపోవచ్చు. కానీ భర్త చేసిన అప్పులుని తీరుస్తోంది.

ఆమె ఎంతో కష్టపడి మళ్లీ కేఫ్ కాఫీ డే ని అభివృద్ధి చేస్తూ వస్తోంది. ఒకటిన్నర సంవత్సరం అవ్వకుండానే 7 వేల కోట్ల అప్పులు తీర్చేశారు. ఇంకా కేవలం మూడున్నర వేల కోట్లను మాత్రమే ఆమె చెల్లించాల్సి ఉంది.

అయితే ఆమె భర్త అనుకున్నట్లు చేయాలని భర్త లాగ మధ్యలో ఆగిపోకూడదు అని అనుకుంది. తన భర్త చేయాలనుకుని చేయలేకపోయిన వాటిని ఆమె చేస్తోంది. ప్రస్తుతం అయితే కేఫ్ కాఫీ డే బాగా నడుస్తోంది. ఈ కంపెనీ షేర్స్ తీసుకోవడానికి టాటా వంటి పెట్టుబడిదారులు ముందుకు వస్తున్నారు.

అందరి అభిరుచుల్ని ఆమెనే చూస్తూ కేఫ్ కాఫీ డే ని అభివృద్ధి చేస్తున్నారు. నిజంగా ఈమెని ఎంతో మంది మహిళలు ఆదర్శంగా తీసుకుని నడవాలి ఆడవాళ్ళు కూడా ప్రయత్నస్తే గెలుపొందచ్చని ఈమెని చూసి అందరూ నేర్చుకుని అదే బాటలో నడవాలి.

Read more RELATED
Recommended to you

Latest news