చంద్రబాబును స్కిల్ స్కామ్ కేసులో అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కోర్ట్ లలో ఈ కేసు నడుస్తోంది. కాగా ఈ రోజు కోర్ట్ లో సిఐడి తరపున లాయర్ ఈ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లో భాగంగా ప్రయివేట్ కంపెనీలు ఒక్క రూపాయి ఇవ్వకుండానే చంద్రబాబు నాయకత్వంలోని ప్రభుత్వం ఏ విధంగా రూ. 300 కోట్లకు పైగా నిధులను ఏ విధంగా రిలీజ్ చేస్తారంటూ వివరించారు. చంద్రబాబుకు తెలిసే స్కిల్ స్కామ్ జరిగిందంటూ తెలిపారు సిఐడి తరపు లాయర్. ఇక షెల్ కంపెనీ లకు కూడా చంద్రబాబు సూత్రధారి అంటూ కోర్ట్ కు చెప్పారు. ఎఫ్ ఐ ఆర్ లో పేరు లేనంత మాత్రాన అరెస్ట్ చేయకూడదన్న నిబంధన ఏమీ లేదని లాయర్ కోర్ట్ కు స్పష్టం చేశారు, గతంలో చాలా కేసుల విషయంలో ఎఫ్ ఐ ఆర్ లో పేరు లేకున్నప్పటికీ పేర్లు చేర్చారని తెలియచేశారు.
ఇక ఈ రోజు విచారణతో చాలా మందికి ఈ కేసుపైన ఒక అంచనాకు వచ్చి ఉంటారని తెలుస్తోంది. ఇంకా ముందు ముందు ఈ స్కిల్ స్కామ్ కేసులో ఎటువంటి విషయాలు బయటకు రానున్నాయి అన్నది తెలియాల్సి ఉంది.