వల్లభనేని వంశీకి మరో ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. వల్లభనేని వంశీ ప్రధాన అనుచరుడు అరెస్ట్ అయ్యాడు. వల్లభనేని వంశీ ప్రధాన అనుచరుడు ఓలుపల్లి మోహనరంగాను తాజాగా సిఐడి పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. గన్నవరం టిడిపి కార్యాలయం పై దాడి చేసిన కేసులో ఏ 1 గా రంగా ఉన్నాడు.

అయితే రంగా అరెస్టుతో ఇటీవల అన్ని కొలిక్కి వచ్చే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారట. వంశీకి కుడి భుజంగా రంగా వ్యవహరిస్తున్నాడు. మరోవైపు సత్య వర్ధన్ కిడ్నాప్ కేసులో వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్ పై ఇవాళ తుది విచారణ జరగబోతోంది. టిడిపి కార్యాలయం పై దాడి కేసులు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై నిన్న విచారణ ముగిసింది. ఇక ఇవాళ వంశీ బెయిల్ పిటిషన్ పై విచారణ జరగనుంది.