ఎమ్మెల్సీగా సినీ నటుడు ఆలీ..? మంత్రి పదవి ఇవ్వనున్న జగన్..?

-

ఎన్నికలకు ముందు తనకు ఎలాంటి పదవులు వద్దని చెప్పిన ఆలీ వైకాపా కార్యకర్తగా పని చేస్తానన్నారు. కాగా ఇప్పుడు ఆలీకి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి ఆయన్ను మంత్రిని చేస్తారని జోరుగా ప్రచారం సాగుతోంది.

ప్రముఖ సినీ నటుడు ఆలీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం విదితమే. ఆయన స్నేహితుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆలీకి ఆ పార్టీలో టికెట్ నిరాకరించడంతో ఆలీ వైకాపాలో చేరారు. ఆ తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అయితే ఎన్నికలకు ముందు తనకు ఎలాంటి పదవులు వద్దని చెప్పిన ఆలీ వైకాపా కార్యకర్తగా పని చేస్తానన్నారు. కాగా ఇప్పుడు ఆలీకి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి ఆయన్ను మంత్రిని చేస్తారని జోరుగా ప్రచారం సాగుతోంది.

ఆంధ్రప్రదేశ్ సీఎం గా జగన్ ప్రమాణం చేశాక ఎవరూ ఊహించని విధంగా తన మంత్రివర్గంలో ఆయ‌న‌ పలువురికి కీలక పదవులు ఇచ్చారు. అయితే కచ్చితంగా మంత్రి పదవులు వస్తాయని ఆశించిన వారికి నిరాశ ఎదురైంది. ఈ క్రమంలో మరో రెండేళ్ల తర్వాత తిరిగి మంత్రివర్గ విస్తరణ చేపడతామని జ‌గ‌న్‌ చెప్పడంతో మంత్రి పదవులు ఆశించిన వారు కొంత శాంతించారు. ఇక మరికొంత మందికి కీలకమైన నామినేటెడ్ పోస్టులను ఇచ్చారు. అయితే మంత్రి పదవులు ఆశించిన వారిలో ఆలీ లేకపోయినప్పటికీ జగన్ ఆలీకి ఎమ్మెల్సీ ఇచ్చి ఆయనను త్వరలో మంత్రివర్గంలోకి తీసుకుంటారని తెలిసింది. కాగా మంత్రివర్గ విస్తరణ రెండేళ్ల తర్వాతే అని చెప్పిన సీఎం జగన్ ఇప్పుడు ఆలీకి మంత్రి పదవి ఇస్తే అసంతృప్తులు ఊరుకుంటారా..? అనే సందేహాలు కలుగుతున్నాయి.

కాగా ఈ విషయంపై ఆలీని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. ఆయన నవ్వుతూ సమాధానం దాటవేస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే ఆలీకి శాసనమండలి సభ్యుడిగా అవకాశం ఇవ్వడంతో పాటు ఆయనకు మంత్రి పదవి దాదాపుగా ఖాయమని వార్తలు వస్తున్నాయి. మరి అందరూ ఊహించినట్లుగానే.. మీడియాలో వస్తున్న వార్తలక‌నుగుణంగానే సీఎం జగన్ ఆలీకి మంత్రి పదవి ఇస్తారా, లేదా.. అన్న విషయం తేలాలంటే మరి కొద్ది రోజుల పాటు వేచి చూడక తప్పదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version