థియేటర్స్ ఓపెనింగ్ : మార్గదర్శకాలు జారీ చేసిన టీ సర్కార్

-

సినిమా ధియేటర్లు మల్టీప్లెక్స్ ల ఓపెనింగ్ తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 50 శాతం సిటింగ్ తో తెలంగాణలో సినిమా థియేటర్లకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది తెలంగాణ సర్కార్.. మాస్కులు శానిటైజర్ తప్పని సరిగా వాడాలని సూచిందించి. టెంపరేచర్ 24 నుంచి 30 మధ్య ఉండేలా చూడాలని ఏసీ థియేటర్లకు ఆదేశాలు జారీ చేసింది.

అక్కడ పని చేసే వ్యక్తులు, ప్రేక్షకులు, సిబ్బంది, అన్ని సమయాల్లో మాస్క్ లు వాడాల్సి ఉంటుంది. హ్యాండ్ శానిటైజర్లు ఎంట్రీ / ఎగ్జిట్ పాయింట్లు మరియు కామన్ పాయింట్స్ లో అందుబాటులో ఉంచవలసి ఉంటుంది. శారీరక దూరం అలాగే సోషల్ డిస్టెన్స్ పాటించాల్సి ఉంటుంది. మొత్తం ప్రాంగణాల పరిశుభ్రత ముఖ్యంగా కామన్ పాయింట్స్ ని ప్రతి స్క్రీనింగ్ తర్వాత సానిటైజ్ చేయాల్సి ఉంటుంది. అన్ని ఎయిర్ కండిషనింగ్ పరికరాల ఉష్ణోగ్రత సెట్టింగ్ 24-30 డిగ్రీల మధ్యలో ఉండాలి. మల్టీ ఫ్లెక్స్ లు అయితే రెండు స్క్రీన్ లకు ఒకేసారి ఇంటర్వెల్ రాకుండా ఉండేలా ప్లాన్ చేయాలి.

 

Read more RELATED
Recommended to you

Latest news