సీఎం గారు.. మాతో చేతులు కలపండి..!

-

ఇటీవలే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అందరూ ఊహించినట్లుగానే ఎన్డీఏ కూటమి ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో బిజెపి పార్టీ అధిక మెజారిటీ సాధించినప్పటికీ ముందు ఇచ్చిన మాట ప్రకారం… బీహార్ ముఖ్యమంత్రి పీఠంలో నితీష్ కుమార్ ని కూర్చోబెట్టింది బిజెపి. అయితే ఇప్పటికే బీహార్లో మంత్రివర్గ విస్తరణ కూడా ముగిసినప్పటికీ బీహార్ రాజకీయాలు మాత్రం ఇప్పటికీ హాట్ హాట్ గా నే జరుగుతున్నాయి. సీఎం నితీష్ కుమార్ కి బీ జె పీ కి మధ్య అంతర్గత యుద్ధం నడుస్తోంది అనే టాక్ వినిపిస్తోంది.

ఈ క్రమంలోనే ఇటీవలే ఆర్జెడి సీనియర్ నేత కీలక వ్యాఖ్యలు చేయడం ప్రస్తుతం బీహార్ రాజకీయాల్లో సంచలనం గా మారిపోయింది. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తమతో చేతులు కలపాలి అంటూ ఆర్జేడీ సీనియర్ నేత అమర్ నాథ్ వ్యాఖ్యానించారు. బీహార్లో సీఎంగా నితీష్ ప్రమాణస్వీకారం చేసినప్పటికీ అధికారం మాత్రం బీజేపీ చేతుల్లోనే ఉందని త్వరలో నితీష్ ప్రభుత్వం కూలిపోవడం ఖాయం అంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఇక ఆ తర్వాత తేజస్వి యాదవ్ ఆధ్వర్యంలో మహాఘాట్ బంధన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు ఆయన.

Read more RELATED
Recommended to you

Latest news