సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ పదవీకాలం శుక్రవారం (వనంబర్ 8వ తేదీ)తో ముగిసిన విషయం తెలిసిందే. ఆయన స్థానంలో జస్టిస్ సంజీవ్ ఖన్నా నూతన సీజేఐగా ఈనెల 11వ తేదీన 51వ సుప్రీంకోర్టు ఉన్నత న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టనున్నారు. భారతదేశ సీజేఐగా పనిచేయడం కన్నా గర్వకారణం ఏముంటుందని,చివరిరోజు తీర్పులు ఏమీ చెప్పనని సంతృప్తిగా రిటైర్ అవుతున్నట్లు పేర్కొన్నారు.
అయితే, తన రిటైర్మెంట్ స్పీచ్ సందర్బంగా సీజేఐ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘రాజకీయ నాయకులే కాదు ప్రైవేట్ ఇంట్రెస్ట్ గ్రూప్స్ నుంచీ న్యాయమూర్తులపై ఒత్తిడి ఉంటుందని సీజేఐ చంద్రచూడ్ అన్నారు. మీడియా, సోషల్ మీడియాతో జడ్జిపై ప్రెజర్ పెట్టి కేసును ఒక దిశగా నడిపించేందుకు ప్రయత్నిస్తారన్నారు. అయితే, ప్రైవేట్ ఇంట్రెస్ట్ గ్రూప్స్ ఏమిటనే దానిపై ప్రస్తుతం నెట్టింట చర్చ జరుగుతోంది. లెఫ్ట్ , రైట్ వింగ్స్ , ఫారిన్ లాబీయింగ్, సారోస్ స్పాన్సర్డ్ ఎన్జీవోస్ అని కొందరి తమ అభిప్రాయం వెల్లడిస్తున్నారు.