నేడు తిరుమ‌ల శ్రీ‌వారిని ద‌ర్శించుకోనున్న సీజేఐ

-

వైకుంఠ ఏకాద‌శి సంద‌ర్భంగా ఈ రోజు సుప్రీం కోర్టు ప్ర‌ధాన న్యాయమూర్తి జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ తిరుమ‌ల శ్రీ వారిని ద‌ర్శంచుకోనున్నారు. అందుకోసం బుధ వారం రాత్రే.. సీజేఐ జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ తిరుప‌తికి చేరుకున్నారు. ఆయ‌న కు టీటీడీ చైర్మెన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవీ జ‌వ‌హ‌ర్ రెడ్డి ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. సీజేఐ జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ బుద వారం రాత్రి ప‌ద్మావ‌తి అతిథి గృహంలో బ‌స చేశారు. కాగ ఈ రోజు ఉద‌యం సీజేఐ జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ స్వామి వారిని ద‌ర్శించుకుంటారు.

కాగ నేడు వైకుంఠ ఏకాద‌శి కావ‌డంతో తిరుమ‌లను ముస్తాబు చేశారు. ఈ రోజు తెల్ల వారు జామున 1:45 గంట‌ల నుంచే స్వామి వారి ద‌ర్శ‌నానికి భ‌క్తుల‌ను అనుమ‌తి ఇస్తారు. కాగ ప్ర‌తి సంవ‌త్స‌రం వ‌చ్చే ముక్కోటి ఏకాద‌శి రోజు తిరుమ‌ల శ్రీ‌వారితో పాటు వైకుంఠ ద్వార ప్ర‌వేశం పొందేందుకు కూడా అనుమ‌తి ఇస్తారు. ప్ర‌ముఖుల‌తో పాటు సామాన్యుల‌కు కూడా వైకుంఠ ద్వర ప్ర‌వేశం ద‌ర్శ‌నానికి అనుమ‌తి ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version